బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ఈటీవీలో మల్లెమాలవారు నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఇలా బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా సందడి చేస్తున్నటువంటి సుడిగాలి సుదీర్ ఒక్కసారిగా మల్లెమాల వారి కార్యక్రమాలకు దూరమవుతూ స్టార్ మా కార్యక్రమంలో సందడి చేశారు.
స్టార్ మా కార్యక్రమంలో యాంకర్ అనసూయతో కలిసి సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఇకపోతే సుడిగాలి సుధీర్ కు మల్లెమాల వారి కన్నా స్టార్ మా పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ చెల్లించడంతో సుధీర్ మల్లెమాల వారి కార్యక్రమాలను వదిలి స్టార్ మాకు ఎంట్రీ ఇచ్చారు.
అయితే ప్రస్తుతం స్టార్ మా లో సూపర్ సింగర్ జూనియర్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత స్టార్ మా ఏ ఇతర కార్యక్రమాలను నిర్వహించకుండా ఉన్నారు.ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.
ఇదే విషయంపై సుధీర్ అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.
సుధీర్ మల్లెమాల వారి కార్యక్రమంలో కొనసాగుతుండగా అధిక రెమ్యూనరేషన్ చెల్లించి స్టార్ మా సుదీర్ ను బయటికి రప్పించారు.అయితే ప్రస్తుతం స్టార్ మా లో ఎలాంటి కార్యక్రమాలు లేకుండా పూర్తిగా సుధీర్ కు అన్యాయం చేశారంటూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు.అయితే స్టార్ మా త్వరలోనే ఒక భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారని ఈవెంట్ మొత్తం సుధీర్ పైనే ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.
ఇక ఈ కార్యక్రమం ద్వారా సుదీర్ ఎప్పటిలాగే ప్రేక్షకులను సందడి చేయబోతున్నారని తెలియడంతో సుధీర్ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.