ఈ ఒక్క హీరోకి తప్ప శృతిహాసన్ టాలీవుడ్ లో అందరికి హిట్స్ ఇచ్చింది..!

శృతిహాసన్ కెరియర్ మొదలు పెట్టిన తొలినాళ్లలో ఐరన్ లెగ్ గా ముద్ర పడింది ఎందుకంటే ఆమె నటించిన ప్రతి సినిమా పరాజయం పాలవడమే ఇందుకు గల కారణం.తమిళ్ లో హే రామ్ అనే సినిమాతో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది.

 Sruthi Haasan Hit Movies With Tollywood Hero's, Sruthi Haasan, Anaganaga O Dheer-TeluguStop.com

తెలుగు సినిమా ఇండస్ట్రీకి అనగనగా ఒక ధీరుడు (Anaganaga O Dheerudu )సినిమాతో సిద్ధార్థ్ సరసన నటిస్తూ ఎంట్రీ ఇవ్వగా ఇది పరాజయాన్ని అందుకుంది.ఆ తర్వాత సిద్ధార్థ్ తో మరోసారి ఓ మై ఫ్రెండ్ అనే సినిమాలో నటించిన ఇది పరవాలేదు అనిపించింది.

అయితే శృతి హాసన్ కి మొదటి సారి గబ్బర్ సింగ్(Gabbar Singh ) తో తెలుగు లో మంచి బ్లాక్ బాస్టర్ విజయం దాక్కగా, తమిళ్ లో ధనుష్ తో 3 మూవీ తో విజయం వరించింది.

Telugu Allu Arjun, Gabbar Singh, Mahesh Babu, Naga Chaitanya, Friend, Prabhas, R

అక్కడ మొదలైన శృతి హాసన్ విజయాలు దాదాపు అందరి హీరోలకు సైతం దక్కేలా చేశాయి.వీర సింహ రెడ్డి సినిమా లో బాలకృష్ణ(Balakrishna ) కు శృతి హాసన్ నటించగా, ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో నటించగా అప్పటి వరకు ఎన్నో ఫ్లాప్ లు ఉండగా, ఈ సినిమాతో ఇద్దరికి విజయాలు వచ్చాయి.

చిరంజీవి తో వాల్తేరు వీరయ్య సినిమాలో శృతి నటించగా, ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.అల్లు అర్జున్(Allu Arjun) తో రేసు గుర్రం(Race Gurram ) సినిమాలో నటించగా ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది.

ఇక మహేష్ బాబుతో ఆగడు సినిమా ఫెయిల్ అయిన శ్రీమంతుడు సినిమా గట్టి విజయాన్ని అందించింది.

Telugu Allu Arjun, Gabbar Singh, Mahesh Babu, Naga Chaitanya, Friend, Prabhas, R

చివరికి నాగ చైతన్య(Naga Chaitanya) కు సైతం ప్రేమమ్ సినిమాతో ఓ మాదిరి విజయం అందించిన శృతి క్రాక్ సినిమా తో రవి తేజ కు బంపర్ హిట్ ఇచ్చింది.ప్రభాస్ తో సలార్ (Salar , Prabhas)సినిమాలో శృతి నటించగా ఇది కూడా మంచి విజయం సాధించింది.ఇలా ఇంతమంది హీరోలకు విజయాలను ఇచ్చిన శృతి హాసన్ కేవలం ఓకే ఒక్క స్టార్ హీరోకు విజయాన్ని అందించలేదు.

ఆ హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్.రామయ్య వస్తావయ్య సినిమాతో ఈ ఇద్దరు జత కట్టగా, ఈ సినిమ పెద్ద ఫ్లాప్ అయ్యింది.అప్పటి నుండి ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి మళ్ళీ ఏ చిత్రంలోనూ నటించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube