ఆర్య మూవీ లో ఈ షాట్ కోసం అల్లు అర్జున్ చేసిన పని తెలిస్తే ..?

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో 2004లో వచ్చిన ఆర్య ( Arya )సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు.ఇది ఆ ఏడాదికి గాను బ్లాక్ బాస్టర్ మూవీగా రికార్డు సాధించింది.

 Allu Arjun Plan For Aarya Movie, Sukumar Aarya, Allu Arjun, Aarya, Aarya 2-TeluguStop.com

అంతే కాదు అప్పటి వరకు అర కొర సక్సెస్ ఉన్న అల్లు అర్జున్ (allu arjun)కి ఇది బ్రహ్మాండమైన టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ మూవీ కావడంతో ఆ తర్వాత కెరియర్ లో వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.ఇక ఆర్య సినిమాలో చాలామందికి తెలియని ఎన్నో ఫాక్ట్స్ ఉన్నాయి అందులో ఒక విషయం ఏమిటి అంటే కాలేజీలో అల్లు అర్జున్ నడుచుకుంటూ వస్తున్న సమయంలో బుక్ ని చాలా స్టైలిష్ గా తిప్పుతూ ఉంటాడు.

Telugu Aarya, Allu Arjun, Sukumar Aarya-Telugu Top Posts

ఇప్పటికి మీరు సినిమా చూస్తే బుక్కు తిప్పడం ఎంతో స్టైలిష్ గా కనిపిస్తుంది.ఈ బుక్ తిప్పడం ఆ తర్వాతే ట్రెండ్ అయింది.చాలామంది ఇప్పుడు అలా బుక్కు తిప్పుతున్నారు అంటే అందుకు గల కారణం సుకుమార్ ఆర్య(Sukumar Arya) సినిమాలో అల్లు అర్జున్ చేత ఆ పని చేయించడమే.అయితే సినిమా షూటింగ్ మొదలవడానికి ముందే అల్లు అర్జున్ ని పిలిచి ఒకరోజు ఇలా స్టైల్ గా బుక్ తిప్పాల్సి ఉంటుందని చేసి చూపించారట.

దానిని ప్రాక్టీస్ చేయమని చెప్పారట.చాలాసేపు ప్రాక్టీస్ చేసినా కూడా అల్లు అర్జున్ అస్సలు ఒక్క రౌండ్ కూడా బుక్ నీ తిప్ప లేకపోయాడట.

Telugu Aarya, Allu Arjun, Sukumar Aarya-Telugu Top Posts

కాసేపు ప్రయత్నించి ఆ తర్వాత బుక్కు తిప్పడం రాకపోయినా సుకుమార్ దగ్గరకు వెళ్లి తనకు బాగా వచ్చేసింది అని చెప్పాడట దాంతో ఓసారి చేసి చూపించు అని అల్లు అర్జున్ ని సుకుమార్ అడిగాడట.కానీ ఒక్క రౌండ్ తిప్పకుండానే బుక్ కింద పడపోవడంతో అల్లు అర్జున్ వల్ల ఆ పని కాదని దానికి ఏదైనా ట్రిక్ ప్లే చేయాలని అనుకున్నాడట.సుకుమార్ కానీ కాసేపటికి మరోసారి వచ్చి చకచక బుక్కు తిప్పేసాడట.దానికి గల కారణం బుక్కు లోపల వెలు పట్టే గ్యాప్ లో ఒక నట్టు పెట్టి దానినీ తిరగడానికి వీలయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నడట.

అది చూసి సుకుమార్ ఆశ్చర్య పోయాడట.తిప్పడం రాకపోయినా సరే ఏదో ఒకటి చేసి సరిగ్గా షార్ట్ వచ్చేలా ప్లాన్ చేసుకోవడం అల్లు అర్జున్ ని చూసి ఎవరైనా నేర్చుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube