సాఫ్ట్వేర్( Software ) కొలువులు వదిలేసి, సమోసాల బిజినెస్ ప్రారంభించి కోట్లలో సంపాదిస్తున్న ఓ జంట సక్సెస్ స్టోరీ ఏమిటో చూద్దాం.2004లో థానేలోని కురకేత్ర యూనివర్సిటీలో జాయిన్ అయినా శిఖర్ వీర్ సింగ్, నిధి సింగ్( Shikhar Veer Singh ) ల పరిచయం ప్రేమగా మారింది.డిగ్రీ పూర్తి చేశాక నిధి బిజినెస్ చేయాలనే ఆలోచనలు ఉండేది.ఢిల్లీలో ఉండే అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ విధానంలో ఉద్యోగంలో చేరింది.శిఖర్ ఇంకా చదువులు చదవాలని హైదరాబాద్ వచ్చి, చదువుకుంటున్న సమయంలో స్నాక్స్ ఐటమ్స్ అమ్మకాల్లో శుభ్రత లేదని గమనించి, నాణ్యత, పరిశుభ్రతతో కూడిన సమోసాల వ్యాపారం( Samosa ) చేయాలనే ఆలోచన తట్టింది.వెంటనే ఈ విషయం నిధితో పంచుకున్నాడు.ఇద్దరి ఆలోచనలలో నుండి కియోస్కోలో సమోసా అమ్మితే బాగుంటుంది అని నిర్ణయించుకున్నారు.
2015 అక్టోబర్లో బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు శిఖర్.ఇతనికి నిధి కూడా పూర్తి సపోర్ట్ అందించింది.ముందుగా శిఖర్ ఓ నాలుగు నెలల పాటు పలు షాపుల్లో జిడ్డు లేకుండా, కాలిపోకుండా ఉండే సమోసాలను తయారుచేశాడు.
కడాయి పన్నీర్ నుండి చాక్లెట్ వరకు రకరకాల రుచుల్లో సమోసాలు తయారు చేయాలని అనుకున్నారు.

ముందుగా తోపుడుబండ్లపై సమోసాలు తయారు చేసి వాటికి సమోసా సింగ్( Samosa Singh ) అని పేరు పెట్టి అమ్మడంతో.అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.వెంటనే బెంగుళూరులో సమోసా సింగ్ పేరుతో క్యూఎస్ఆర్ అవుట్ లెట్ ను ప్రారంభించి, హోమ్ డెలివరీలు చేయడం ప్రారంభించారు.రెండు సమోసాల ధర రూ.20, రెండు చికెన్ మఖానీ సమోసాలు రూ.55 కు అమ్ముతుండడంతో భారీగా ఆర్డర్లు వస్తున్నాయి.

ఏకంగా జర్మనీ నుండి ఎనిమిది వేల సమోసాల ఆర్డర్ రావడంతో, నిధి మార్కెటింగ్ లో, శిఖర్ ఆర్డర్లు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు.సమోసా సింగ్ పేరు మారుమోగడంతో బెంగుళూరు, హైదరాబాద్, పూణేలలో అవుట్ లెట్లను ప్రారంభించారు.ప్రస్తుతం నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తూ సంవత్సరానికి కోట్లల్లో డబ్బు టర్న్ అవర్ చేస్తున్నారు.భవిష్యత్తులో విదేశాలలో కూడా తమ సమోసా సింగ్ ను టెస్ట్ చేయించాలని అనుకుంటున్నట్లు నవ దంపతులు తెలిపారు.