సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే సివిల్స్ సాధించిన యువకుడు.. ఈ యువకుడి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.అయితే ఒక వ్యక్తి మాత్రం ఒకవైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగం( Software Job ) చేస్తూనే మరోవైపు సివిల్స్ ( Civils ) సాధించాడు.

 Software Employee Civils Ranker Bollam Uma Maheshwar Reddy Inspirational Success-TeluguStop.com

ఎంతో కష్టపడి తన సక్సెస్ తో ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.బొల్లం మహేశ్వరరెడ్డి( Bollam Maheshwar Reddy ) సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.

మహేశ్వరరెడ్డి స్వస్థలం బోయపల్లి కాగా ప్రస్తుతం ఇతని కుటుంబం కదిరిలో స్థిరపడింది.

మహేశ్వరరెడ్డి తండ్రి విశ్రాంత జువాలజీ లెక్చరర్ కాగా తల్లి పద్మావతి విశ్రాంత ఉపాధ్యాయురాలు.

ఐఐటీలో బీటెక్( B.Tech ) చదివిన మహేశ్వరరెడ్డి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో సివిల్స్ ను ఎంచుకుని ప్రిపేర్ అయ్యారు.చదువు విషయంలో పేరెంట్స్ నుంచి సపోర్ట్ లభించడంతో ఒకవైపు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే మహేశ్వరరెడ్డి సివిల్స్ లో చేరారు.ఢిల్లీలోని వాజీరాలో సివిల్స్ కోసం శిక్షణ తీసుకున్నాడు.

Telugu Bollamuma, Bowenpally, Civils Ranker-Inspirational Storys

ఒకవైపు జాబ్ చేస్తూనే సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యి సులువుగా లక్ష్యాన్ని సాధించాడు.ఎట్టకేలకు తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని మహేశ్వరరెడ్డి అన్నారు.జాతీయ స్థాయిలో 270వ ర్యాంక్( Civils 270th Rank ) సాధించి మహేశ్వరరెడ్డి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది.కొడుకుకు సివిల్స్ లో మంచి ర్యాంక్ రావడంతో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Telugu Bollamuma, Bowenpally, Civils Ranker-Inspirational Storys

మహేశ్వరరెడ్డి తన టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.బాల్యం నుంచి మహేశ్వరరెడ్డి చదువులో టాప్ లో ఉండేవారని తెలుస్తోంది.లక్ష్యాన్ని ఎంతో కష్టపడి సాధించిన మహేశ్వరరెడ్డి ప్రజలకు తన జాబ్ ద్వారా సేవ చేయాలని ఫీలవుతుండటం గమనార్హం.మహేశ్వరరెడ్డి తన ప్రతిభతో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకోవడంతో పాటు సివిల్స్ సాధించాలన్న కలను నెరవేర్చుకుని కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కలిగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube