అన్న కంటే తమ్ముడు బెటర్ గా ఉన్నాడే.. హిట్‌ కొట్టేలా ఉన్నాడు

టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ హీరోలతో సినిమాలను నిర్మించి ఒకప్పుడు స్టార్ నిర్మాతగా పేరు దక్కించుకున్న బెల్లంకొండ సురేష్ ఇప్పుడు సినిమాల నిర్మాణం కు దూరంగా ఉంటున్నాడు.కానీ ఆయన కొడుకులు ఇద్దరు కూడా హీరోలుగా పరిచయం అయ్యారు.

 Social Media Comments On Bellamkonda Sai Ganesh Swathy Muthyam Teaser , Bellamko-TeluguStop.com

ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా పరిచయమై వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు.అయితే ఇప్పటి వరకు కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అనేది ఈ బెల్లంకొండ హీరోకి దక్కలేదు.

ఇప్పుడు ఆయన తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.త్వరలోనే గణేష్ నటించిన స్వాతి ముత్యం సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది.

తాజాగా సినిమా కు సంబంధించిన టీజర్‌ విడుదల అయింది.గణేష్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదలైన ఆ వీడియోలో గణేష్ నటనకి మంచి మార్కులు పడుతున్నాయి.

పలు సినిమాలను చేసిన సాయి శ్రీనివాస్ కంటే గణేష్ నటన చాలా బాగుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

స్వాతిముత్యం సినిమా తో కచ్చితంగా గణేష్ మంచి మార్కులు దక్కించుకోవడంతో పాటు టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోల సరసన నిలిచే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్వాతిముత్యం సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 5వ తారీకున విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.చూడడానికి ఇన్నోసెంట్ అన్నట్లుగా కనిపిస్తున్నాడు.అంతే కాకుండా మాస్ సన్నివేశాలకు సరిగ్గా సెట్ అవుతాడు అని కూడా అనిపిస్తుంది.అందుకే బెల్లంకొండ సాయి గణేష్ త్వరలోనే టాలీవుడ్ లో మంచి స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని.

అన్న కంటే తమ్ముడే బెటర్ గా ఉన్నాడు కనుక తమ్ముడితోనే ఎక్కువ సినిమాలు చేయాలని నిర్మాతలు ముందుకు వచ్చే అవకాశం ఉందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.స్వాతిముత్యం సినిమా విడుదల కాక ముందే సాయి గణేష్ మరో సినిమాని మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

నేను స్టూడెంట్ ని సర్ అనే టైటిల్ తో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోల సరసన నిలిచి అవకాశం గణేష్ కి దక్కుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube