సీత‌క్క‌కు కీల‌క బాధ్య‌త‌లు.. కాంగ్రెస్‌లో ఇక తిరుగుండ‌దా..?

కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో జోరు పెంచుకుంటూ పోతుంది.మొన్నటి వరకు నిస్తేజంగా ఉన్న క్యాడర్ రేవంత్ రెడ్డి రాకతో జోష్ లో ఉంది.

 Sita Has Key Responsibilities Will He Turn Around In Congress , Seethakka, Reva-TeluguStop.com

కాంగ్రెస్ నాయకత్వం కూడా ఇందుకు తగ్గట్టే కార్యక్రమాలు రూపొందించుకుంటూ పోతుంది.ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ కు రాష్ర్టంలో పాత కాలం నాటి వైభవాన్ని తీసుకొచ్చేందుకు అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేట్ల పై తమ సమరం సాగించాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్ పార్టీ.ప్రస్తుతం మరో విషయం కూడా పార్టీ శ్రేణులకు కిక్కిస్తోంది.

అదేంటంటే.

కాంగ్రెస్ అనుబంధ సింగరేణి సంస్థ ఐఎన్టీయూసీకి కాంగ్రెస్ లో మాస్ లీడర్, లేడీ టైగర్ గా పేరు తెచ్చుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ను నియమించేందుకు రంగం సిద్ధమైయిందట.

ఇక అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి అని అంతా చర్చించుకుంటున్నారు.ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి.

Telugu @revanth_anumula, Mla Seethakka, Revanth, Rewanth Reddy, Seethakka-Telugu

కాగా.2017లో జరిగిన బొగ్గు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంద సంస్థ అయిన తెలంగాణ బొగ్గు గని సంఘం విజయ బావుటా ఎగరవేసింది.అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ అనేక వరాలు కురిపించి కార్మికులను ప్రలోభపెట్టారని కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు.అప్పుడు ప్రకటించిన వరాల్లో ఏ ఒక్కటి కూడా నేటికీ తీర్చలేదని సింగరేణి నాయకులు పేర్కొంటున్నారు.కాగా సింగరేణి గనులున్న ప్రాంతంలో కాంగ్రెస్ కు మంచి పట్టుంది.2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ సునామీలో రాష్ర్ట వ్యాప్తంగా ఢీలా పడిపోయిన కాంగ్రెస్ బొగ్గు గనులు ఉన్న ఇల్లందు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో విజయబావుటా ఎగరవేసింది.అక్కడి కార్మికులు కూడా కాంగ్రెస్ వెంటే ఉన్నారని ఈ గణాంకాలను చూస్తేనే అర్థమవుతోందని చెబుతున్నారు కాంగ్రెస్ నాయకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube