అద్భుతం చేసిన సిరాజ్... ఆస్ట్రేలియా వేదికపై 181.6కిమీ వేగంతో బంతిని విసరగా జరిగింది ఇదే!

ఆస్ట్రేలియా బ్యాటర్ మార్కస్ లబుషేన్ పై మహ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడు.కోపంతో ఊగిపోయిన సిరాజ్ వికెట్లకి గురిపెట్టి బంతిని బలంగా విసిరాడు.

 Siraj Performed A Miracle As He Bowled The Ball At A Speed Of 181.6 Kmph On The-TeluguStop.com

ఆ బంతిని లబుషేన్ టచ్ చేయలేదు గానీ నేరుగా కీపర్ చేతుల్లో మాత్రం పడింది.అయితే మహ్మద్ సిరాజ్ గంటకి 181.6 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరినట్లు సమాచారం రాగానే క్రికెట్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఆస్ట్రేలియాతో( Australia ) డే/నైట్ టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ అడిలైడ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన పింక్ బాల్‌ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 180 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటవగా.

నేడు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 86/1తో నిలిచింది.

Telugu Australia, Throw, Mohammed Siraj, Sirajpermed-Top Posts

తాజా తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్ ( Mohammed Siraj )29 పరుగులు మాత్రమే ఇచ్చాడు కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.అయితే 10 ఓవర్లలో 3 మెయిడిన్ చేసి అందరికీ ఆశ్చర్యపరిచాడు.ఈ క్రమంలో సిరాజ్ ఒక బంతిని గంటకి 181.6కిమీ వేగంతో విసిరినట్లు లైవ్‌లో చూపించగా ప్రస్తుతం ఆ దృశ్యం వైరల్ అవుతోంది.దాంతో చాలామంది క్రికెట్ అభిమానులు ఆ దృశ్యం కోసం ఆన్లైన్లో తెగ శోధిస్తున్నారు.క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డ్ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్( Shoaib Akhtar ) పేరిట ఉంది.అతను గంటకి 161.3 కిమీ వేగంతో బంతిని విసిరిన సంగతి తెలిసినదే.అయితే.మహ్మద్ సిరాజ్ ఇపుడు 181.6 వేగంతో బంతులు వేయడంతో అక్తర్ రికార్డ్ బద్దలు కొట్టినట్టు అయింది.

Telugu Australia, Throw, Mohammed Siraj, Sirajpermed-Top Posts

ఇక ఇప్పటి వరకూ సిరాజ్ గంటకి సగటున 135-145కిమీ వేగంతో మాత్రమే బంతులు వేస్తూ వచ్చాడు.కానీ సడన్‌గా అతనిలో మార్పుని చూసి ఆయన అభిమానులు అవాక్కవుతున్నారు.విషయం ఏమిటంటే… ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని విసిరేందుకు రనప్‌తో వేగంగా రాగా.స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మార్కస్ లబుషేన్ సైట్ స్క్రీన్ వద్ద ప్రేక్షకుడు పైపుని తీసుకుని నడవడంతో ఏకాగ్రత లోపించడంతో బంతిని ఎదుర్కోకుండా వెనక్కి మళ్లాడు.

దాంతో అప్పటికే దాదాపు బంతిని విసిరేందుకు సిద్ధమైన సిరాజ్ బౌలింగ్‌ను ఆఖరి క్షణంలో ఆపేసినా.కోపం చల్లారక త్రో రూపంలో బంతిని వికెట్లపైకి చాలా స్పీడుగా విసిరాడు.దాంతో ఆ బంతి వేగం సాంకేతిక లోపం కారణంగా గంటకు 181.6 కిమీతో నమోదైంది.దాంతో సిరాజ్ స్పీడ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube