ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ఎన్నారై ల పిలలకి తెలుగు బాష ని నేర్పడానికి.తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేయడానికి సిలికాన ఆంధ్రా వారు చేసే కార్యక్రమాలు ఎంతో మంచి ఫలితాలని ఇస్తున్నాయి అయితే ఈ క్రమంలో సిలికాన్ ఆంధ్రా మన బడి ద్వారా తెలుగు బాషా సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు ఈ నెల 12న పరీక్ష నిర్విహించారు.
అయితే పరీక్షలని నిర్వహించిన 2017-18 విద్యా సంవత్సారానికి గాను 1933 మంది విద్యార్థులు, ప్రపంచ వ్యాప్తంగా 58 కేంద్రాల్లో పరీక్షలు రాశారు…అయితే ఈ విద్యార్ధులలో 1400 మంది జూనియర్, 533 మంది సీనియర్ సర్టిఫికెట్ కోసం పరీక్షలు రాశారు…ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అలేఖ్య పుంజల మాట్లాడుతూ.ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నా పిల్లలకు తెలుగు భాష నేర్పించటానికి కృషి చేస్తున్న పిల్లల తల్లి తండ్రులకి కృతజ్ఞతలు తెలిపారు .
ఈ సందర్భంగా “మనబడి” అధ్యక్షుడు చమర్తి మాట్లాడుతూ.గత 10 ఏళ్లుగా 35 వేల మందికి పైగా బాలబాలికలు మనబడి ద్వారా తెలుగు నేర్చుకున్నారని తెలిపారు.250 కేంద్రాల ద్వారా తెలుగు నేర్పిస్తున్న మనబడి విద్యావిధానానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, అమెరికలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ అర్హత కూడా ఉందని తెలిపారు.
అంతేకాదు 2018-19 సంవత్సరానికి గాను కొత్తగా చేరే వారికోసం అడ్మిషన్స్ ప్రారంభమైనట్టు మనబడి నిర్వాహకులు తెలిపారు.మనబడి వెబ్‌సైట్ ద్వారా ఆగస్టు 31లోగా నమోదు చేసుకోవాలని సూచించారు.విదేశాలలో ఉన్నా సరే తెలుగుని తమ పిలలకి నేర్పించాలనే కోరిక ఉన్న తల్లి తండ్రులకి కృతజ్ఞతలు తెలిపారు మనబడి నిర్వాహకులు.