Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ నటించిన మల్టీస్టారర్ సినిమాల లెక్క తెలిస్తే షాకవ్వాల్సిందే?

సూపర్ స్టార్ కృష్ణ మరణం గురించి టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు.మహేష్ బాబుకు దేవుడు ధైర్యం ప్రసాదించాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

 Shocking Facts About Super Star Krishna Cine Career Details Here Goes Viral , Su-TeluguStop.com

కృష్ణ తన సినీ కెరీర్ లో 80కు పైగా మల్టీస్టారర్ సినిమాలలో నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.కృష్ణ నటించిన తొలి మల్టీస్టారర్ ఇద్దరు మొనగాళ్లు కాగా ఈ సినిమాలో కాంతారావు మరో హీరోగా నటించారు.

సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా స్త్రీ జన్మ కాగా ఐదు సినిమాలలో ఎన్టీఆర్, కృష్ణ కలిసి నటించడం గమనార్హం.ఏఎన్నార్ ను చూసి హీరో కావాలని అనుకున్న కృష్ణ తక్కువ సమయంలోనే ఆ కోరికను నెరవేర్చుకున్నారు.

ఏఎన్నార్ తో కృష్ణ ఆరు సినిమాలలో నటించగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

కృష్ణ, కృష్ణంరాజు మధ్య మంచి స్నేహం ఉండేది.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో 19 సినిమాలు వచ్చాయి.కొన్ని నెలల క్రితం కృష్ణంరాజు మరణించగా ఆయన మరణం కృష్ణను ఎంతగానో బాధ పెట్టింది.

కృష్ణ శోభన్ బాబు కాంబినేషన్ లో ఏకంగా 13 సినిమాలు తెరకెక్కడం గమనార్హం.మహేష్ బాబుతో ఏడు సినిమాలలో నటించిన కృష్ణ రమేష్ బాబుతో ఐదు సినిమాలలో నటించి సక్సెస్ లను సొంతం చేసుకున్నారు.

Telugu Cine Career, Gudhachari, Krishna, Krishna Raja, Shobhan Babu, Krishnacine

మూడో సినిమా గూఢఛారి 116తో ప్రభంజనం సృష్టించిన కృష్ణ వెండితెరపై సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.ఈ సినిమాసక్సెస్ తో కృష్ణకు ఆంధ్రా జేమ్స్ బాండ్ గా గుర్తింపు దక్కింది.తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన కృష్ణ ఆ ప్రయోగాలకు తగిన ఫలితాన్ని కూడా సొంతం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube