సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి వరుస పెట్టి స్టార్స్ అందరితో సినిమాలు చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా.ఆ తర్వాత కొద్దీ రోజులు తమన్నా కెరీర్ స్లో గా నడిచినా ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది.
తమన్నా తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులు కోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మళ్ళీ కెరీర్ ను గాడిలో పెట్టుకుంది.
హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ గా, స్పెషల్ సాంగ్ లలో కూడా స్టెప్పులు వేసి ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కెరీర్ డౌన్ కాకుండా చూసుకుంటూ వస్తుంది.
ఇక ఇటీవల కాలంలో ఈమె సీనియర్ హీరోల సరసన కూడా ఓకే చెబుతూ వరుస అవకాశాలు అందుకుంటుంది.ఈ మధ్యనే ఈమె వెంకీ సరసన నటించిన ఎఫ్ 3 కూడా విజయం సాధించింది.
దీంతో పాటు ఈమె ఇప్పుడు చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది.ఇదిలా ఉండగా ఈమె కెరీర్ బిజీగా కొనసాగుతుండగానే ఈమె పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి.
ఇక తాజాగా మరోసారి ఈమె పెళ్లి వార్తలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.ఈమె త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని కోలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఈమె కొన్ని రోజుల క్రితమే పెళ్ళికి ఓకే చెప్పిందని.ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తో ఈమె పెళ్లి ఫిక్స్ అయ్యింది అంటూ రూమర్స్ వస్తున్నాయి.మరి ఈ వార్తలపై అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.ముందు ముందు అయినా ఈమె పెళ్లి గురించి అఫిషియల్ గా చెబుతుందో లేదో చూడాలి.