తెలంగాణలో నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయ్యాయి.ఈ మేరకు రాష్ట్రంలో ఎనిమిది కాలేజీలను ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు.
సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూలుతో పాటు రామగుండంలో మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి.ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మెడికల్ కాలేజీల ఏర్పాటు సరికొత్త అధ్యాయమని సీఎం కేసీఆర్ అన్నారు.రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా మారుతోందన్నారు.
ఎనిమిది కొత్త కాలేజీలు ప్రారంభించుకోవడం గర్వకారణమని తెలిపారు.మారుమూల ప్రాంతాల్లో సైతం మెడికల్ కాలేజీలు వస్తాయని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యనించారు.
కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చేందుకు హరీశ్ రావు ఎంతగానో కృషి చేశారని చెప్పారు.రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2790 కి పెరిగిందని తెలిపారు.33 జిల్లాల్లో మెడికల్ కాలేజీల్లో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.