స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ విషయం లో నిరాశ తప్పడం లేదు.
పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో కనీసం 10 కోట్ల షేర్ కలెక్షన్స్ కూడా నమోదు చేయలేక పోవడంతో బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా చాలా దూరాన ఉండి పోతుందని అంతా భావిస్తున్నారు.ఈ సినిమా భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేస్తుందని.
తప్పకుండా సమంత కెరీర్ లో బిగ్ మూవీ గా నిలుస్తుందని అనుకున్నారు.కానీ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే ఈ సినిమా కనీసం పాతిక కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసే పరిస్థితి లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
సినిమా కు వచ్చిన పాజిటివ్ టాక్ వల్ల కలెక్షన్స్ భారీగా ఉంటాయని అంతా అనుకున్నప్పటికీ ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కువగా చేయక పోవడం వల్లే జనాలు ఇప్పుడు సినిమా కు రావడం లేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సమంత ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన లేదు.కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది.ఆమె అనారోగ్యం పరిస్థితి కారణంగా యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న లేక పోయింది.
అంతే కాకుండా సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ తో మీడియా ముందుకు వచ్చింది.ఆ ఇంటర్వ్యూ సినిమా యొక్క ఫలితాన్ని మార్చలేక పోయిందని చెప్పాలి.భారీ అంచనాల నడుమ కాస్త ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన యశోద సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.అయినా కూడా పాజిటివ్ మార్కులే దక్కించుకుందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సమంత ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే కలెక్షన్స్ కాస్త ఎక్కువగా ఉండేవేమో అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.