టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్( puri jagannath ) కూడా ఒకరు.పూరీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో కెరీ తొలినాళ్లలో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా( Block Baster Hits ) నిలిచాయి.
దేశముదురు, పోకిరి, టెంపర్ లాంటి సినిమాలు పూరీ జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పడతాయి.అయితే ఈ మధ్య కాలంలో పూరీ తీసిన సినిమాలలో కథ, కథనం ఏ మాత్రం ఆసక్తికరంగా లేవు.
లైగర్ సినిమా( Liger movie ) పూరీ జగన్నాథ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను భారీ స్థాయిలో నిరాశపరిచాయి.
అయితే ఆ సినిమా ఫ్లాపైనా ఇస్టార్ట్ శంకర్( Ismart shankar movie ) సినిమాతో తనకు సక్సెస్ ఇచ్చిన పూరీకి హీరో రామ్( Hero Ram ) మరో ఛాన్స్ ఇచ్చారు.ఆ అవకాశాన్ని పూరీ జగన్నాథ్ సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

పూరీ తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. పూరీ, ఛార్మి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.కథ, కథనం విషయంలో పూరీ మారితే మాత్రమే ఆయనకు అద్భుతమైన విజయాలు దక్కుతాయి.ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ అనేది పూరీ జగన్నాథ్ కు అనుకోని విధంగా దక్కిన విజయమేననే సంగతి తెలిసిందే.
క్రిటిక్స్ ను ఈ సినిమా ఏ మాత్రం మెప్పించలేదు.పూరీ జగన్నాథ్ కు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అయినా లాభాలను అందిస్తుందేమో చూడాల్సి ఉంది.ఈ సినిమా పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కనుందని తెలుస్తోంది.పూరీ జగన్నాథ్ కు భవిష్యత్తు రోజులు కలిసిరావాలని ఆయనకు పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పూరీ జగన్నాథ్ ఈ జనరేషన్ ఆడియన్స్ కు నచ్చే సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.