పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉంటూ ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.18 నెలల్లో పవన్ నటించిన నాలుగు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.మరోవైపు ఈరోజు పవన్ నటించిన తొలిప్రేమ( toliprema ) సినిమా థియేటర్లలో రీరిలీజ్ అయింది.ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
అయితే తొలిప్రేమ సినిమాకు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ విషయాలు తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
పవన్ కళ్యాణ్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఒక ఇంటర్వ్యూలో తొలిప్రేమ డైరెక్టర్ కరుణాకరన్( Director Karunakaran ) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తొలిప్రేమ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత పవన్ ను కలవడానికి ఏడు నెలల సమయం పట్టిందని ఆయన చెప్పుకొచ్చారు.

తొలిప్రేమ కథ చెప్పడానికి పవన్ ఉదయం 7 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారని కారులో బయలుదేరిన కొంత సమయం తర్వాత కారు పంక్చర్ కావడంతో పవన్ ను చెప్పిన సమయానికి కలవలేదని ఆయన పేర్కొన్నారు.8.30 గంటలకు పవన్ ను కలవడానికి వెళ్లగా పవన్ చేతిలో గన్ ఉందని ఆయన తెలిపారు.కథ నచ్చకపోతే కాల్చేయరు కదా అని చెప్పగా పవన్ నవ్వేయడంతో కోపం ఒక్కసారిగా పోయిందని కరుణాకరణ్ అన్నారు.

తమిళంలో కథ చెబుతానని చెప్పినా పవన్ ఓకే చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు.ప్రతి సీన్ కు స్టోరీ బోర్డ్ వేయడం నాకు అలవాటు అని కరుణాకరణ్ అన్నారు.కథ విన్న వెంటనే సినిమా చేస్తున్నామని పవన్ చెప్పారని ఆయన తెలిపారు.
ఈ మనస్సే సాంగ్ పవన్ కు ఇష్టమని ఆ సాంగ్ ఎడిటింగ్ సమయంలో రాత్రి 8 గంటలకు ఆ సాంగ్ చూపించాలని పవన్ అడిగారని కరుణాకరన్ పేర్కొన్నారు.కొంచెం వెయిట్ చెయ్యండి అని చెప్పి ఆ సాంగ్ ను ఎడిట్ చేయడానికి రాత్రి 2 అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
అప్పటికీ పవన్ బయట ఉండటంతో షాకయ్యానని కరుణాకరన్ పేర్కొన్నారు.ఆ సాంగ్ చూసిన తర్వాత బాగా చేశావని పవన్ కళ్యాణ్ కౌగిలించుకున్నారని కరుణాకరన్ చెప్పుకొచ్చారు.