బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ తెలుగు కార్యక్రమం డిసెంబర్ 17వ తేదీ ఎంతో గ్రాండ్ గా ఫినాలే పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) విజేతగా నిలిచారు.
ఇక ఈ సీజన్లో పాల్గొన్నటువంటి వారిలో హీరో శివాజీ ( Shivaji ) కూడా ఒకరు.ఈయన బిగ్ బాస్ లోకి అడుగు పెట్టగానే తప్పకుండా తానే విన్నర్ అవుతారు అంటూ మొదటి నుంచి కూడా శివాజీ టైటిల్ రేస్ లో ఉన్నారు.
అయితే చివరి వారాలలో శివాజీ ఫిజికల్ టాస్కులలో ఆసక్తి చూపించకపోవడంతో ఈయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.
ఈ విధంగా శివాజీ ఓటింగ్ శాతం తగ్గిపోవడంతో టైటిల్ రేసులోకి అమర్ పల్లవి ప్రశాంత్ వచ్చారు.అయితే అమర్ రన్నర్ గా నిలవగా ప్రశాంత్ విజేతగా నిలిచారు.ఇక ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత శివాజీ బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఎపిసోడ్స్ అన్నింటిని కూడా చూస్తున్నారు.
అయితే 12వ వారం నుంచి తనని బిగ్ బాస్ చాలా నెగిటివ్ గా చూపించారని ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక్కసారిగా బిగ్ బాస్ నిర్వాహకులపై ఫైర్ అయ్యారు.
12వ వారం నుంచి బిగ్ బాస్ నిర్వాహకులు ఎడిటింగ్ కారణంగా నన్ను చాలా నెగిటివ్ గా చూపించారని ఈయన తెలియజేశారు.నిజానికి అక్కడ జరిగినది ఒక్కటైతే ఇక్కడ చూపించింది మరొకటని మేమంతా సరదాగా మాట్లాడుకున్నటువంటి మాటలను కూడా ఇక్కడ ఫోకస్ చేయడంతో తనపై నెగెటివిటీ పెరిగిపోయిందని తెలిపారు.నేను అమర్ ని టార్గెట్ చేయలేదు కానీ ఇక్కడ చేసినట్టు చూపించారు.
అమర్ నే నేను టార్గెట్ చేస్తే ఫైనల్ వరకు ఆయన వచ్చేవారు కాదు కదా అంటూ ప్రశ్నించారు.ఇలా నాపై నెగిటివ్ గా ప్రచారం చేసి చూపించడానికి నన్ను ఎందుకు బిగ్ బాస్ కి పిలవాలి.
ఇష్టం లేనప్పుడు పిలవకపోవడమే మంచిది కదా అంటూ శివాజీ సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.