ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ఈమె పేరు చెప్తే ఎక్కువగా తెలుగు వారికి తెలియదు.కానీ నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ అంటే అందరికీ గుర్తుకు వస్తుంది.
చెన్నైలో పుట్టి పెరిగిన ప్రియాంక మోహన్ అసలు పేరు ప్రియాంక అరుల్ మోహన్.
మొదట కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత తమిళ, తెలుగు సినిమాల్లో కూడా నటించింది.అలా మొదటిసారి తెలుగులో నాని హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్ (Gang leader) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత శర్వానంద్ హీరోగా చేసిన శ్రీకారం సినిమాలో హీరోయిన్ గా చేసింది.ఇక త్వరలోనే ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా వస్తున్న ఓజి సినిమాలో అలాగే గుర్తుందా శనివారం సినిమాలతో మన ముందుకు రాబోతుంది.
అలాగే తెలుగులో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) తో డాన్,డాక్టర్ వంటి సినిమాల్లో నటించింది.ఇక సినిమాల మీద ఉన్న ఆసక్తితో ప్రియాంక మోహన్ ఇండస్ట్రీకి ఎలాగైనా ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుందట.అయితే ఈమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగా లేకపోవడంతో డబ్బు కోసం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో కొన్ని చీప్ ప్రకటనల్లో నటించాల్సి వచ్చిందట.
అలాంటి చీప్ యాడ్స్ లో నటించేటప్పుడు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారని,ఆ డబ్బు నా అవసరాలకి,నా కుటుంబ అవసరాలకు కూడా అంతగా సరిపోలేదని,నేను ఆ సమయంలో సంపాదించిన డబ్బులు మా కుటుంబానికి ఉన్న అప్పులకు వడ్డీ కట్టడానికి కూడా సరిపోలేదు అంటూ ప్రియాంక మోహన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అయితే ప్రస్తుతం ప్రియాంక మోహన్ (Priyanka Mohan) కి హీరోయిన్ గా మంచి గుర్తింపు అయితే లభించింది.ప్రస్తుతం ఈమె తన ఒక్కో సినిమాకి రెండు నుండి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.