నటి జ్యోతిక అని చెప్పడం కంటే సూర్య జ్యోతిక (Suriya,Jyothika)అని చెబితేనే వీరి పేర్లకు పరిపూర్ణత అనేది ఉంటుంది.ఎందుకంటే వీరిద్దరూ అంత అన్యోన్యంగా ఉంటారు.
అయితే అలాంటి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.దానికి ప్రధాన కారణం సూర్య చెన్నై లో ఉంటే జ్యోతిక సూర్యని వదిలేసి ముంబై (Mumbai) కి వెళ్ళింది.
దీంతో వీరి మధ్య విడాకుల వార్తలు ఎక్కువైపోయాయి.మరి నిజంగానే జ్యోతిక సూర్యకి విడాకులు ఇస్తుందా.ఎందుకు ముంబై వెళ్లాల్సి వచ్చింది.అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమాలో నటించే సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట ఫ్యామిలీకి చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత ఇంట్లో వాళ్లకి ఈ విషయం తెలిసిపోవడంతో మరోసారి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.అలా సూర్య జ్యోతిక (Suriya ,Jyothika) ఇద్దరు రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.ఇక వీరికి ఒక బాబు పాప కూడా ఉన్నారు.అయితే తాజాగా వీరి బంధం ముగిసిపోతుందని,వీరిద్దరూ కూడా చిన్నచిన్న గొడవల వల్ల విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకోబోతున్నారు అంటూ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చింది జ్యోతిక(Jyothika) .సూర్యతో విడాకులు అంటూ వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదు.నేను ఎప్పటికీ సూర్యని వదలను.
సూర్య ఒక మంచి వ్యక్తి.అలాగే చెన్నైలో సూర్య నేను ముంబైలో ఉండడానికి ప్రధాన కారణం ముంబైలో ఉన్న నా పేరెంట్స్ ని నేను చూసుకోవడం కోసమే.
అయితే ఒక కూతురుగా నా తల్లిదండ్రులకు క్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం నామీద ఉంది.అందుకే నేను నా పేరెంట్స్ కోసం ముంబై రావాల్సి వచ్చింది.
అంతేకానీ మా మధ్య విడాకులు తీసుకునేంత దూరం పెరగలేదు.అలాగే మేము ఎప్పటికీ విడాకులు తీసుకోము అంటూ జ్యోతిక క్లారిటీ ఇచ్చింది.
జ్యోతిక క్లారిటీతో వీరి విడాకుల వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది.