సీరియల్ నటి శ్రీవాణి ఈ మధ్య కాలంలో సీరియళ్లతో పాటు బుల్లితెర ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ పాపులారిటీని పెంచుకుంటున్నారు.సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణులలో శ్రీవాణి కూడా ఒకరు.
తాజాగా ఈ ప్రముఖ నటి కొత్త కారును కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఈ కారు ఖరీదు ఏకంగా 13 లక్షల రూపాయలు అని సమాచారం అందుతోంది.
శ్రీవాణి సీరియళ్ల ద్వారా భారీగానే సంపాదిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మారుతి గ్రాండ్ విటారా కారును ఆమె కొనుగోలు చేశారు.విలన్ రోల్స్ ద్వారా పాపులర్ అవుతున్న శ్రీవాణికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.యూట్యూబ్ లో వ్లాగ్స్ చేయడం ద్వారా ఆమె ఫేమస్ అవుతున్నారు.
భర్త, కూతురుతో కలిసి ఆమె చేస్తున్న వ్లాగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
యూట్యూబ్ వీడియోలలో కుటుంబానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఆమె పంచుకుంటున్నారు.కొత్త కారును కొనుగోలు చేసిన తర్వాత శ్రీవాణి కారుకు పూజ చేయడంతో పాటు తన సన్నిహితులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.కొత్త కారు ఫోటోలను శ్రీవాణి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈటీవీ సీరియల్స్ శ్రీవాణికి మంచి పేరును తెచ్చిపెట్టడం గమనార్హం.యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీవాణి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.శ్రీవాణి కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.రోజుకు 15,000 రూపాయల రేంజ్ లో శ్రీవాణి రెమ్యునరేషన్ ఉందని తెలుస్తోంది.
శ్రీవాణి క్రేజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.