సింగపూర్​ శాస్త్రవేత్తల అధ్యయనంలో సంచలన నిజాలు.. 150 ఏళ్లు బ్రతకవచ్చంటున్న పరిశోధకులు.. !

మానవును జీవన విధానం, అభివృద్ధి ఊహించనంతలా మారిపోయింది.నిప్పుకోసం కొట్టుకునే స్దాయి నుండి నిప్పు పెట్టేస్దాయికి చేరుకున్నాడు మనిషి.

 Sensational Facts On Human Life In The Study Of Singapore Scientists, Singapore-TeluguStop.com

అయినా ఆశ చావదం లేదు.సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఈ ప్రకృతిని నాశనం చేశాడు.

ఇది చాలదన్నట్లుగా అంతరిక్షంలో కూడా మకాం పెట్టడానికి అడుగులు వేస్తున్నాడు.ఇన్ని చేస్తున్న మనిషి మేధస్సు మరణాన్ని జయించే మందును కనుగొనలేక పోతున్నాడు.సృష్టినే తన చేతిలో పెట్టుకున్న మనిషి చావును మాత్రం విధాత చేతిలో పెట్టాడు.ఇకపోతే పూర్వకాలం నుండి చూసుకుంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో మానవుని ఆయురార్ధం ఎంతో తగ్గిందని చెప్పవచ్చూ.

అయితే సింగపూర్ కు చెందిన జెరో అనే బయోటెక్ సంస్థ పరిశోధకులు మనిషి గరిష్ఠంగా ఎన్నేళ్లు బతకవచ్చు అన్న అంశం పై అధ్యయనం చేశారు.ఈ క్రమంలో ప్రస్తుత పరిస్దితుల్లో గరిష్ఠంగా 120 నుంచి 150 ఏళ్ల దాకా బతకడానికి అవకాశాలున్నాయని వెల్లడిస్తున్నారు.

ఇదంతా మనిషి ఎదుర్కొనే ఒత్తిళ్లు, నడక, చేసే పనుల మీదే అది ఆధారపడి ఉంటుందని తేల్చారు.అదీగాక శరీరంలోని రక్తకణాలు వయసు పెరిగే కొద్దీ తరగడం మొదలవుతుందని, ఆ రక్తకణాలు ఎంత వేగంగా తగ్గిపోతే అంత వేగంగా వృద్ధాప్యం రావడం వల్ల మరణానికి దగ్గర అవుతున్నారను పేర్కొంటున్నారు.

కాగా చాల మందిలో 30 నుంచి 40 ఏళ్ల మధ్యే రక్తకణాలు తగ్గడం మొదలవుతుందని దీని వల్ల చిన్న వయస్సులోనే మరణాలు సంభవిస్తున్నాయని తెలుపుతున్నారు.ఇక వైద్య శాస్త్రాన్ని మరింతగా అభివృద్ది చేస్తే సగటు జీవితకాల౦ ను పెంచుకోవచ్చని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube