వైరల్ వీడియో: తన పెళ్ళిలో గాల్లోకి తుపాకీ పేల్చిన పెళ్లికూతురు.. చివరకి.?!

పెళ్ళిలో సంబరాలు చేసుకోవడం కామన్ అయితే కొందరు అత్యుత్సాహంతో మారణాయుధాలతో సంబరాలు చేసుకుంటారు.కొందరు తల్వార్లు తిప్పుతూ ప్రదర్శన చేస్తే, మరికొందరు ఏకంగా గన్ తో గాల్లోకి కాల్పులు జరుపుతుంటారు.

 Viral Video The Bride Who Fired A Gun Into The Gall At Her Wedding Finally, Vir-TeluguStop.com

గతంలో ఇటువంటి ఘటనలు చాలానే జరిగాయి.ఇక తాజాగా ఓ వధువు తన పెళ్ళిలో గన్ తో గాల్లోకి కాల్పులు జరిపింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.ఉత్తర ప్రదేశ్ ప్రతాప్ ఘర్ జిల్లాలోని జెథ్వారా ఏరియాకు చెందిన రూపా పాండే వివాహం తాజాగా జరిగింది.

ఈ పెళ్ళిలో వధువు రూపా పాండే వివాహ వేదిక ఎక్కుతూ గన్ తో గాల్లోకి కాల్పులు జరిపింది.ఈ దృశ్యాలను కెమెరాలో బంధించిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఆ వీడియో వైరల్ గా మారి పోలీసుల కంటపడింది.దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

రూపా పాండే కాల్పులు జ‌రిపిన రివాల్వ‌ర్ ఆమె మామ రామ్ నివాస్ పాండేది అని పోలీసులు గుర్తించారు.రూపా పాండే, ఆమె మామ రామ్ నివాస్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇదిలా ఉండగా మరోచోట కరోనా లక్షణాలుండీ వివాహ విందుకు హాజరైన ఓ యువకుడి కారణంగా 250 జనాభా ఉన్న ఊరిలో సగంమందిపైగా వైరస్‌ బారినపడ్డారు.

వరుడి తండ్రి సహా ఆరుగురు మృతి చెందారు.

ఇంకొందరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన కుల పెద్ద ఈసం భద్రయ్య కుమారుడి పెళ్లి మే 14న జరిగింది.అదే రోజు రాత్రి విందు ఏర్పాటు చేశారు.

కట్టుబాటు ప్రకారం ఊరిలో ప్రతి ఇంటి నుంచి విందు భోజనానికి హాజరయ్యారు.పొరుగునున్న కొమ్ముగూడెం, గిద్దెవారిగూడెం నుంచి కూడా బంధుమిత్రులు పాల్గొన్నారు.

ఇదే సందర్భంలో లక్షణాలున్న గిద్దెవారిగూడెం యువకుడు అందరితో కలిసి తిరిగాడు.తర్వాత క్రమంగా గ్రామంలో ఒక్కొక్కరు అనారోగ్యానికి గురయ్యారు.

కొందరు మామూలు జ్వరం, దగ్గు అనుకుని నిర్లక్ష్యం చేశారు.తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు ఆస్పత్రి వెళ్లగా పాజిటివ్‌ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube