పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి( Mallareddy ) గురువారం మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి( Malkajigiri ) నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

 Sensational Comments Of Mla Mallareddy Will Contest As Mp If Party Orders , Brs,-TeluguStop.com

గతంలో తాను మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచినా అనుభవం ఉందని స్పష్టం చేశారు.ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అని అసెంబ్లీ స్థానాలలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిచిందని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఇదే తరహాలో ప్రజలు తమ పార్టీని ఆదరిస్తారని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మల్కాజిగిరి లోక్ సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలను బీఆర్ఎస్( BRS ) గెలుస్తుందన్నారు.వచ్చే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానం ఎంపీ స్థానాల విజయంపై దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు.లోక్ సభ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించి గెలుపే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో తన పోటి విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.ఈనెల 21వ తారీఖున తెలంగాణ భవన్ లో మల్కాజిగిరి పార్లమెంటు సమీక్ష సమావేశాన్ని అధిష్టానం నిర్వహిస్తుందని అన్నారు.

ఈ క్రమంలో మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులతో పార్టీ పెద్దలు భేటీ కానున్నట్లు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube