టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఈ జాబితాలో తెలుగుదేశం 94 స్థానాలు, జనసేన పార్టీ 24 అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు ఎంపీ స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలో జనసేన పార్టీకి( Janasena ) కేవలం 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అంగీకరించడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో సెటైర్లు వేస్తున్నారు.మంత్రి అంబటి రాంబాబు, రోజా.
తీవ్రంగా విమర్శలు చేశారు.చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టినట్లు ఉందని వ్యాఖ్యానించారు.
కాగా ఇదే రకంగా వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) కూడా స్పందించారు.సీట్ల పంపకంపై పవన్ కళ్యాణ్ చెబుతున్న లెక్కలు చూస్తుంటే మంగళవారం సామెతను తలపిస్తుందని వ్యంగ్యంగా విమర్శించారు.
చంద్రబాబు( Chandrababu ) తన కులానికి 21 స్థానాలు ప్రకటించుకున్నారు.కాపులకు మరి హీనంగా ఏడు సీట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు.చంద్రబాబుకి మేలు చేయడం కోసమే రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ 24 స్థానాలతో కాపులకు రాజ్యాధికారం అందిస్తాడా అని నిలదీశారు.పవన్ కళ్యాణ్ ఎలాంటివాడో కాపులకు ఇవాళ అర్థమయింది.
ఇన్నాళ్లు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు అంటూ పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు.ఆఖరికి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబే నిర్ణయించే పరిస్థితి నెలకొంది అంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.