హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఆరేళ్ల చిన్నారి కిడ్నాపైన కథ సుఖాంతమైంది.చిన్నారి కృతిక కనిపించడం లేదన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పాప ఆచూకీని కనుగొన్నారు.
చిలకలగూడలో నివాసం ఉంటున్న దంపతుల కుమార్తె కృతిక.స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.
ఈ క్రమంలో ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయింది.చుట్టుపక్కల గాలించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ పుటేజ్ ద్వారా పాపను ఓ యువకుడు జేబీఎస్ కు వెళ్లినట్లు గుర్తించారు.ఈ క్రమంలోనే ధూళిమట్టలో పాపను గుర్తించిన స్థానిక పోలీసులు కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం పాపను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.