సికింద్రాబాద్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఆరేళ్ల చిన్నారి కిడ్నాపైన కథ సుఖాంతమైంది.చిన్నారి కృతిక కనిపించడం లేదన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పాప ఆచూకీని కనుగొన్నారు.

చిలకలగూడలో నివాసం ఉంటున్న దంపతుల కుమార్తె కృతిక.స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయింది.చుట్టుపక్కల గాలించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ పుటేజ్ ద్వారా పాపను ఓ యువకుడు జేబీఎస్ కు వెళ్లినట్లు గుర్తించారు.

ఈ క్రమంలోనే ధూళిమట్టలో పాపను గుర్తించిన స్థానిక పోలీసులు కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం పాపను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన