హిందూ మహాసముద్రంలో పెద్ద రంధ్రం.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు..

తాజాగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు హిందూ మహాసముద్రంలో( Indian Ocean ) ఓ పెద్ద గురుత్వాకర్షణ రంధ్రం( Gravity Hole ) కనుగొన్నారు.దీనిని ఇంగ్లీష్‌లో గ్రావిటీ హోల్ అని పిలుస్తారు.

 Scientists Discover Gravity Hole In Indian Ocean Details, Indian Institute Of Sc-TeluguStop.com

గ్రావిటీ హోల్ అనేది గ్రావిటేషనల్ పుల్ బలహీనంగా ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది.ఈ పుల్ తక్కువ ఉండటం వల్ల ఈ ప్రాంత సముద్ర మట్టం తక్కువగా ఉంటుంది.

ఇక్కడ గ్రావిటేషనల్ పుల్ అనేది వాటి ద్రవ్యరాశి కారణంగా వస్తువుల ఆకర్షణ శక్తిని సూచిస్తుంది.గ్రావిటీ హోల్ అనేది ద్రవ్యరాశి సాంద్రత సగటు కంటే తక్కువగా ఉన్న ప్రాంతం.

ఇండియన్ ఓషన్ జియోయిడ్ లో (IOGL) అని పిలిచే ఈ రంధ్రం గురుత్వాకర్షణ శక్తుల కారణంగా సముద్ర మట్టం కంటే కిందకు కుచించుకుపోయింది.పురాతన సముద్ర కదలికలు, మిలియన్ల సంవత్సరాల క్రితం వేడి కరిగిన శిల ప్రవాహం( Molten Rocks ) వల్ల ఈ రంధ్రం ఏర్పడిందని పరిశోధకులు కనుగొన్నారు.వారు భూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి సీస్మోమీటర్లు అనే పరికరాల నుంచి డేటాను ఉపయోగించారు.

ఇక కంప్యూటర్ అనుకరణలు వేడి, తక్కువ-సాంద్రత కలిగిన శిలాద్రవం ఉపరితలం పైకి లేచినప్పుడు గురుత్వాకర్షణ రంధ్రం ఏర్పడిందని చూపించింది.గురుత్వాకర్షణ రంధ్రానికి శిలాద్రవం ఈ ప్లూమ్స్ ప్రధాన కారణమని పరిశోధకులు నిర్ధారించారు.అయితే హిందూ మహాసముద్రంలో ఇలాంటి ఒక గొయ్యి ఉంటుందని తెలిసి సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు.

దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఇంకా సముద్రాల్లో ఇలాంటి హోల్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్లారిటీ లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube