టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా( Tamannah ) గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె నటించిన లస్ట్ స్టోరీస్ 2( Lust Stories 2 ) వెబ్ సిరీస్ కారణంగా వార్తలలో నిలిచారు.
ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ( Vijay Varma ) తో ప్రేమలో పడటం వల్ల ఈమె తరచూ తన డేటింగ్ రూమర్స్ గురించి వార్తల్లో నిలిచారు.అయితే చివరికి తనతో ప్రేమలో ఉన్నానని ఈమె ప్రకటించారు.
ఇక ఈ వెబ్ సిరీస్ లో తమన్నా ఇదివరకు ఏ సినిమాలో కూడా నటించిన విధంగా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేశారు.లిప్ లాక్ వంటి బోల్డ్ సన్నివేశాలలో ఈమె నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ విధంగా బోల్డ్ సీన్స్ చేసినప్పటికీ చేస్తే తప్పేంటి అంటూ ఎదురు ప్రశ్నలు కూడా వేస్తూ అందరి నోర్లు మూయిస్తున్నారు.అయితే ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా తమన్నా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె సౌత్ స్టార్స్ గురించి వారి వారసుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా తమన్న మాట్లాడుతూ సౌత్ స్టార్స్ తనతో చాలా గౌరవంగా ప్రవర్తించారని తెలియజేశారు.
ఇక సౌత్ హీరోలైనటువంటి రామ్ చరణ్( ( Ramcharan ) అల్లు అర్జున్ ( Allu Arjun ) నాగచైతన్య( Nagachaitanya ) వంటి హీరోల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఈ హీరోలకు భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈమె నాగచైతన్య రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఈ హీరోల గురించి తమన్న మాట్లాడుతూ… ఈ స్టార్ హీరోలు అందరూ కూడా సూపర్ స్టార్ల చేతులలో చాలా ఆలనా పాలనగా పెరిగారని తెలిపారు.
నేను చైతన్య రామ్ చరణ్ తో కలిసి నటించాను.షూటింగ్ లోకేషన్ వారు నాతో చాలా మర్యాదగా, గౌరవంగా వ్యవహరించే వారని తెలియజేశారు.వారంతా చాలా పద్ధతిగా పెరిగారని ఈమె తెలియజేశారు.ఇక నేను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో స్టార్ హీరోయిన్ అవుతానని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గారు అంటూ ఈ సందర్భంగా తమన్నా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







