సత్యదేవ్ గాడ్సే ట్రైలర్ టాక్..!

యువ హీరో సత్యదేవ్ లీడ్ రోల్ లో గోపీ గణేష్ పట్టాభి డైరక్షన్ లో వస్తున్న సినిమా గాడ్సే.సీకే స్క్రీన్స్ బ్యానర్ లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు.

 Satyadev Godse Trailer Talk , C Kalyan , Gadse Trailer , Godse , Latest Movi-TeluguStop.com

ఈ మూవీలో సత్యదేవ్ సరసన మళయాళ భామ ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది.ఆమె తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇదే.ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.సత్యమేవ జయతే.

ధర్మో రక్షితి రక్షత: అని అంటారు.కానీ సమాజంలో సత్యం, ధర్మం ఎప్పుడూ స్వయంగా గెలవట్లేదని అని పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ వచ్చింది.

అవినీతి రాజకీయ నాయకుల మీద ఓ వ్యక్తి చేసిన పోరాటమే గాడ్సే కథ.కంటెంట్ ఉన్న కథతో మరోసారి సత్యదేవ్ తన టాలెంట్ చూపించాలని చూస్తున్నాడు.పవర్ ఫుల్ డైలాగ్స్ తో గాడ్సే ట్రైలర్ అయితే సినిమాపై ఆసక్తి కలిగించేలా చేసింది.జూన్ 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

ఈ సినిమాతో పాటుగా సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube