అదేంటి, 60 కోట్ల షేర్ దాటింది అన్నారు.గబ్బర్ సింగ్, దూకుడు లాంటి సినిమాల్ని కొట్టేసింది అన్నారు.
అల్లు అర్జున్ కెరీర్లో అతిపెద్ద హిట్ అన్నారు.మళ్ళీ ఇలా ఫ్లాప్ అనడం ఎంటి అని అనకుంటున్నారా.
సరైనోడు 60 కోట్ల షేర్ కొట్టిన మాట నిజమే.గబ్బర్ సింగ్ ను దాటి అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి అయిదు సినిమాల్లో ఒకటిగా నిలిచిన మాట నిజమే.
అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గేస్ట్ హిట్ అన్న మాట కూడా నిజమే.అయితే , ఇదంతా మన దేశం వరకే.
ఓవర్సీస్ లో చాలా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది సరైనోడు .అల్లు అర్జున్ గత రెండు చిత్రాల కలెక్షన్లు చూసి డబ్బులు తగలబెట్టేసారు బయ్యర్లు.ఫలితం .నష్టాలు.
ఇప్పటివరకూ అమెరికాలో 875,518 డాలర్లు మాత్రమే సంపాదించిన సరైనోడు, ఓవర్సీస్ లో తన బాక్సాఫీస్ పరుగుని దాదాపుగా ఆపేసినట్టే.