హైదరాబాద్, నవంబర్ 28, 2021: దక్షిణ భారతదేశంలో ప్రధానమైన రియల్ ఎస్టేట్ మరియు హాస్పిటాలిటీ సంస్థ అయిన సుచిర్ ఇండియా వారి సీఎస్ఆర్ విభాగం సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఈరోజు లయన్ డాక్టర్ వై.కిరణ్ పుట్టినరోజు సందర్భంగా సంకల్ప్ దివస్ 2021ని జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సమాజం కోసం సేవ చేసిన సంస్థలకి, వ్యక్తులకి సుచిర్ ఇండియా ఫౌండేషన్ వారు ‘సంకల్ప్ తార అవార్డులు’ ప్రకటించారు.ఇది కాకుండా ములుగు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ సీతక్కకి కోవిడ్-19 సమయంలో చేసిన సేవకి గుర్తింపుగా సంకల్ప్ సంజీవని పురస్కారం అందించారు.
ప్రముఖ సినీనటుడు, రచయిత, దర్శకుడు శ్రీ తనికెళ్ల భరణి, 2021 పద్మశ్రీ అవార్డు విజేత శ్రీ కనకరాజు ఆ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొని, విజేతలకి సంకల్ప్ తార అవార్డులు బహుకరించారు.ప్రతి సంవత్సరం సుచిర్ ఇండియా ఫౌండేషన్ అసాధారణ సామాజిక సేవ చేసిన సంస్థలు, వ్యక్తులను గుర్తిస్తుంది.
ప్రజలు, వ్యాపార సంస్థలకు స్ఫూర్తి కలిగించి, వారిని సమాజానికి పునరంకితం చేసేందుకు స్ఫూర్తినిచ్చేలా ఆయా సంస్థలు, వ్యక్తులకు రివార్డులు ఇస్తుంది.
ఈ సందర్భంగా సుచిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లయన్ డాక్టర్ వై.కిరణ్ మాట్లాడుతూ, “సంతోషం సంపద పోగేసుకుంటే కాదు… దాన్ని పదిమందితో పంచుకుంటే వస్తుంది.సామర్థ్యమున్న ప్రతి వ్యక్తీ సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలని, అప్పుడే మనతో పాటు మన భావితరాలకు అందమైన భవిష్యత్తును నిర్మించగలమని నేను నమ్ముతాను.
మనలో చాలామంది సమాజహితం కోసం కష్టపడతారు.అలా గొప్ప పనులు చేసేవారిని గుర్తించి, వారు మరింతగా చేసేలా ప్రోత్సహించడానికే సంకల్ప్ తార అవార్డులు ఇస్తున్నాం.ఈ సంవత్సరం కూడా, గొప్ప పనులు చేస్తున్న కొందరు వ్యక్తులతో పాటు కొన్ని సంస్థలను మేం ఎంపిక చేశాం” అని తెలిపారు.
ఈ ఏడాది అవార్డుల విజేతలు ఇలా ఉన్నారు.
సంస్థలు: మేక్ ఎ డిఫరెన్స్, మార్పు ఫౌండేషన్, ఛీర్స్ ఫౌండేషన్, మేక్ ఎ విష్, స్మైల్ ఫౌండేషన్, సహీదిశ ఫౌండేషన్.వ్యక్తులు: శ్రీ పెదబాల (రంపచోడవరం – తూర్పుగోదావరి), డాక్టర్ రమావత్ నరేందర్ (పాల్వంచ- కొత్తగూడెం), శ్రీమతి పరేశమ్మ (గోపిదిన్నె – చిత్తూరు), శ్రీమతి జక్కుల రేణుక (లింగాపూర్- సిద్దిపేట), శ్రీ కోమెర జాజి గుంటూరు), కుమారి శ్రావ్యా రెడ్డి (హైదరాబాద్).
రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా ఎదుగుతున్న సంస్థలలో ఒకటైన సుచిర్ ఇండియా ప్రస్తుతం సాతంరాయి సమీపంలో టేల్స్ ఆఫ్ గ్రీక్, కొత్తూరు సమీపంలో గిజాపొలిస్ (రెండూ బెంగళూరు హైవే మీద), అల్వాల్ సమీపంలో ఆర్యవర్త నగరి లాంటి ప్రాజెక్టులు నిర్మిస్తోంది.మరో 12 ప్రాజెక్టులు రాబోయే కాలంలో మొదలవుతాయి.2025 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని సుచిర్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.ఈ దిశగా తగిన కార్యాచరణ చేపడుతోంది.
సుచిర్ ఇండియా గురించి:
దేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను 2005 నుంచి సుచిర్ ఇండియా ఒక ఆకారంలోకి తీసుకొస్తోంది.వివిధ ప్రాంతాల్లో నివాస, ఆహ్లాద రంగాల్లో అద్భుతమైన ప్రాజెక్టులను అందిస్తోంది.రియల్ ఎస్టేట్, లీజర్, హాస్పిటాలిటీ తదితర రంగాల్లో తన సామర్థ్యాన్ని ఇప్పటికే రుజువు చేసుకున్న ఈ సంస్థ అద్భుతమైన డిజైన్లు, భవన నిర్మాణ సామాగ్రిలో నాణ్యతపై దృష్టిపెట్టి, సమయానికి డెలివరీ ఇవ్వడం ద్వారా సరికొత్త జీవనశైలిని ఆవిష్కరిస్తోంది.