మన టాలీవుడ్ లో ఎంత మంది ముద్దుగుమ్మలు ఉన్నప్పటికీ ఈమె మాత్రం అందరికి స్పెషన్ నే.ఈమెకు హీరోల మాదిరిగా స్పెషల్ ఫాలోయింగ్ ఉంది.
అలా అని ఈమె చాలా సినిమాలు చేసింది అని అనుకోకండి.ఈమె చేసింది కొద్దీ సినిమాలే అయినప్పటికీ ఈమె మాత్రం అందరికి ఫెవరెట్ యాక్ట్రెస్.
ఇంకా చెప్పాలంటే న్యాచురల్ బ్యూటీ ఎవరు అని అడిగితే వెంటనే ఈమె పేరు గుర్తుకు వస్తుంది.
ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది అనుకుంటా.
ఈమె మరెవరో కాదు.ఫిదా తో అందరిని ఫిదా చేసి అందరి చేత శబాష్ అనిపించుకున్న ముద్దు గుమ్మా సాయి పల్లవి.
ఈమె గురించి ఎంత చెప్పిన తక్కువే.సెమీ డాక్టర్ గా కెరీర్ లో సెటిల్ అయ్యాకనే హీరోయిన్ గా కూడా సూపర్ సక్సెస్ సాధించింది.
ఫిదా సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఈమె ఆ సినిమాలో భానుమతి సింగిల్ పీస్ అంటూ ఎలా డైలాగ్ చెప్పిందో అలానే ఈమె నిజజీవితంలో కూడా ఉంటుంది.
ఈమె లాగా మరే హీరోయిన్ ఉండదు అంటే అతియసోక్తి కాదేమో.ఈ రోజుల్లో హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ కు ప్రాధాన్యం ఇస్తూ ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే చాలు ఏ క్యారెక్టర్ అయినా ఓకే అని ప్రొసీడ్ అవుతూ ఉంటారు.కానీ సాయి పల్లవి అందరిలా కాదు.
ఈమె తనకు నచ్చకపోతే ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా కూడా వద్దు అని ముఖం మీదే చెప్పే దైర్యం కలది.
ఇప్పటికే ఈమె కథ నచ్చలేదని చాలా సినిమాలను వదులుకుంది.ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.
తాజాగా ఈమె నేచర్ లో కలిసి పోయి పసుపు కార్మికులతో ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒకటి షేర్ చేసింది.
ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఈమె పసుపు కార్మికులులాగా తలకి టవల్ కట్టుకుని నవ్వులు చిందిస్తూ సంతోషంగా వారితో కలిసి ఫోటో దిగింది.ఈ ఫోటోను సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.
ఈమెలా ఏ హీరోయిన్ చేయలేదు అంటూ నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.