కరోనాకు వ్యతిరేకంగా మేముసైతం అంటోన్న తేజు, కొరటాల

ప్రస్తుతం కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌తో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.అయితే కరోనా మహమ్మారిని అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుందని పలువురు అంటున్నారు.

 Sai Dharam Tej Koratala Siva Donates Big For Corona Victims-TeluguStop.com

కాగా ఈ లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి.ఇటు ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా భారీ స్థాయిలో నష్టాలు చవిచూడనుంది.

అయితే ప్రభుత్వానికి, అధికారులకు మద్దతు తెలపడమే కాకుండా వారు చేస్తున్న మంచిపనులకు పలువురు అండగా నిలుస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో నివారణ చర్యలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి.

దీనికి మద్దతుగా సినీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు విరాళం అందించేందుకు ముందుకు వచ్చారు.చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో పాటు త్రివిక్రమ్, వినాయక్, నితిన్, లాంటి వారు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వానికి విరాళాన్ని అందించారు.కాగా తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తనవంతుగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వానికి రూ.10 లక్షలు అందజేశాడు.

మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా రూ.10 లక్షల విరాళాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేశాడు.ఇలా అందరూ ముందుకు వచ్చి కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని వారు పిలుపునిచ్చారు.ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావద్దని వారు ఈ సందర్భంగా అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube