TSRTC (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) MDగా VC సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో సంస్థను లాభాల బాటలో పరుగులు పెట్టిస్తున్నారు.ఏ సందర్భాన్నైనా అందిపుచ్చుకుంటూ ఎక్కువ మంది ప్రజలు RTC బస్సులను ఎక్కేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఎప్పటికప్పుడు అటు సిబ్బంది, ఇటు ప్రయాణీకుల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నారు.ఇక సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.
అందులో వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటూ సంస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు.
నష్టాల్లో ఉన్న సరే, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని బుతువుల్లో ప్రతి ఊరికి టైం టూ టైమ్ బస్సులను నడుపుతున్నాం.
అలాగే లక్షల మందిని గమ్యస్థానాలకు శర వేగంగా చేరవేస్తోంది.సమయపాలన, ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా ఏడు రకాల సర్వీసులను తెలంగాణ రాష్ట్రం మొత్తం నడుపుతోంది.కాలనుగుణంగా ఎన్నో మార్పులు చేసుకుంటూ ప్రజలకు అత్యుత్తమ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తోంది టీఎస్ ఆర్టీసీ అంటూ ఓ వీడియో మేక్ చేసారు.
ఈ క్రమంలోనే తెలుగు అక్షరమాలను ఉపయోగిస్తూ RTC చేస్తున్న సేవలను ప్రజలకు తెలిసే విధంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సజ్జనార్.
ఇక వీడియోలో వున్న విషయాన్ని గమనిస్తే, అ: అన్ని రకాల ప్రయాణాలకు; ఆ: ఆలయాల దర్శనములకు; ఇ: ఇంటి వరకు సర్వీస్ నడుపుతూ; ఈ: EMI బాధలు ఉండవు; ఉ: ఉన్నతముగా; ఊ: ఊరికి ఊరికి నడుపుతూ; బు: బుతువు; ఎ: ఏదైనా; ఏ: 7 రకాల సర్వీసులు నడుపుతూ; ఒ: ఒకే విధముగా; ఔ: ఔనత్యముగా; అం: అందరి; క: కళ్యాణలకు; ఖ: ఖచ్చతమైన వర్తింపులతో; గ: గమ్యం ఏదైనా; ఘ: ఘనముగా చేరవేస్తూ; చ: చిరుజల్లులో కూడా; ఛా: ఛత్రముగా; జ: జనాలను చేరవేస్తూ; ఝ: ఝాషము వలె; ట: టైం నుంచి టైం వరకు; ఠ: ఠీవిగా నడిపిస్తూ; డ: డీల పడకుండా; త: తెలంగాణ మొత్తం; ద: దూరం ఎంతైనా; ధ: ధైర్యంను ఇస్తు; న: నష్టాల్లో ఉన్న; ప: ప్రజల ప్రయాణాలు ఆపకుండా; ఫ: ఫలితాలు ఎలా ఉన్నా బ: బస్సులను నడుపుతోంది.ఇలా RTC అంటే అర్ధం చెబుతోంది.