అక్క‌డ పురుష అస్థిపంజ‌రాల కుప్ప‌లు... స‌మాచార‌మంతా తెలిస్తే షాక‌వుతారు!

ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో అనేక సుందరమైన చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.వాటి రహస్యాలు అన్వేష‌ణ‌తో వెల్లడవుతున్నాయి.

 Roopkund Lake Of Uttarakhand Is Full Of Male Skeletons Details, Roopkund Lake, I-TeluguStop.com

వీటిలో ఒకటే రూప్‌కుండ్ సరస్సు.రూప్‌కుండ్ సరస్సులో ఉన్న అస్థిపంజరాలు మొదటిసారిగా 1942లో కనుగొన్నారు.

దీనిని నందా దేవి గేమ్ రిజర్వ్‌కు చెందిన రేంజర్ హెచ్‌కె మాధవల్ కనుగొన్నారు.నేషనల్ జియోగ్రఫీకి ఈ స్థలం గురించి తెలియడంతో వారు ఇక్కడికి ఒక బృందాన్ని పంపారు.ఆ బృందం ఈ ప్రదేశంలో మరో 30 అస్థిపంజరాలను కనుగొంది.1942 నుండి మొద‌లైన ప‌రిశోధ‌న‌ల్లో ఇప్పటి వరకు వందల కొద్దీ మగ అస్థిపంజరాలు వెలికివ‌చ్చాయి.అన్ని వ‌య‌సుల పురుషుల‌ అస్థిపంజరాలు ఇక్కడ కనుగొన్నారు.ఇంతేకాకుండా ఇక్కడ కొన్ని ఆభరణాలు, తోలు చెప్పులు, గాజులు, గోర్లు, వెంట్రుకలు, మాంసం మొదలైనవి కూడా కనుగొన్నారు.వీటిని భద్రపరిచారు.

విశేషమేమిటంటే చాలా అస్థిపంజరాలకు తలపై కూడా పగుళ్లు క‌నిపించాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.కన్నౌజ్ రాజు జస్ధావల్ తన గర్భవతి అయిన భార్య రాణి బలంపతో కలిసి ఇక్కడ తీర్థయాత్రకు వ‌చ్చాడు.

ఇక్క‌డి నుంచి హిమాలయాల్లోని నందాదేవి గుడిలో అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సివుంది.ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నందా దేవి దర్శనానికి ఎంతో ప్రాధాన్యత ఉండేది.

రాజు ఎంతో ఉత్సాహంతో ప్రయాణం సాగించాడు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా రాజు త‌ర‌ ప్రదర్శనతో కూడాని ప్ర‌యాణాన్ని వివ‌ర‌మించుకోలేదు.

అతను త‌న‌ బృందంతో డప్పులు వాయిస్తూ ఈ ప్రయాణం సాగించాడని స్థానికులు చెబుతారు.దీంతో దేవత ఆగ్రహానికి గురయ్యింద‌ట‌.

Telugu Roopkund, Roopkund Lake, Lake, Uttarakhand-General-Telugu

ఆ సమయంలో చాలా భయంకరమైన,పెద్ద వడగళ్ళు, మంచు తుఫాను కురిసిందట‌.దీని కారణంగా రాజు, రాణితో సహా మొత్తం జ‌న‌సమూహం అంతా రూప్‌కుండ్ సరస్సులో మునిగిపోయార‌ట‌.మ‌రో పరిశోధనలో ట్రెక్కర్ల బృందం ఇక్కడికి వ‌చ్చింద‌ని తెలిసింది.ఈ బృందం అకస్మాత్తుగా వ‌చ్చిన‌ మంచు తుఫానులో చిక్కుకుంది.ఈ సమయంలో ఆకాశం నుండి బంతిలా పెద్ద వడగళ్ళు ప‌డ్డాయ‌ట‌.ఈ భయంకరమైన తుఫాను నుండి ఎవరూ తప్పించుకోలేకపోయార‌ట‌.

ఎందుకంటే ఇక్క‌డి నుంచి 35 కిలోమీటర్ల దూరం వ‌ర‌కూ తల దాచుకోవడానికి స్థలం లేదు.దీంతో వారంతా అక్క‌డే మృతి చెందార‌ని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube