Rhino Football Field: ఫుట్‌బాల్ మైదానంలోకి వచ్చిన ఖడ్గమృగం.. షాకింగ్ వీడియో వైరల్!

సాధారణంగా ఖడ్గ మృగాలు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి.అవి తమ కొమ్మును ఒక్కసారి విసిరితే చాలు సింహాలైనా సరే బొక్కలు విరిగి చనిపోవాల్సిందే.

 Rhino Enters The Football Ground Video Viral Details, Rhinoceros, Football Groun-TeluguStop.com

ఈ మృగ మృగాలకి అంత పవర్ ఉంటుంది.అయితే అలాంటి ఈ మృగం తాజాగా ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి వచ్చింది.

అకస్మాత్తుగా అది మైదానంలోకి రావడంతో ఫుట్‌బాల్ ఆడేవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.అయితే ఆ మైదానంలో ఎక్కువగా పచ్చ గడ్డి ఉండటంతో దాన్ని తినేందుకు ఈ ఖడ్గమృగం వచ్చింది.

తమ ఆటకు ఆటంకం కలిగించిన ఈ భారీ జంతువును ప్లేయర్లు బయటికి పంపించాలనుకున్నారు కానీ అది కొంచెం కూడా కదలలేదు.దాంతో దాని వెనుక భాగంపై చేతులు వేసి ఏదో కారుని తోసినట్లు ముందుకు తోశారు.

అయినా కూడా అది అంగుళం కూడా కదల్లేదు.అనుకోని అతిథి వల్ల ఫుట్‌బాల్ మ్యాచ్ ఆపేయాల్సి వచ్చిందని.

ఆ అనుకోని అతిథి మరెవరో కాదు ఇదిగో అంటూ ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ పెట్టారు.ఈ సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ను ఔట్ చేయడానికి చాలా కష్టపడాలని ఫన్నీగా ఒక క్యాప్షన్ జోడించారు.

ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఖడ్గమృగం గ్రౌండ్ లో నడుస్తూ పచ్చటి గడ్డిని ఖడ్గమృగం తింటోంది.ఈ 18 సెకన్ల వీడియోకు దాదాపు 4 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు.‘పాపం దానికి బాగా ఆకలి అయినట్టుంది.అందుకే అలా వచ్చేసింది’ అని కామెంట్ చేస్తున్నారు.

మరికొందరు వామ్మో ఆ మృగం వస్తే మేమైతే పారిపోతామని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube