అర్జున్ రెడ్డి బ్యూటీతో వర్మ నగ్నం సీక్వెల్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్ సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.తన పేరుతో ఓ ఏటీటీని ప్రారంభించి అందులో ఈ సినిమాలను రిలీజ్ చేస్తూ వరుసగా దూసుకుపోతున్న వర్మ, ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం చిత్రాలను రిలీజ్ చేయగా, తాజాగా పవర్ స్టార్ అనే సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

 Rgv Naked Sequel With Sri Sudha, Rgv, Naked, Sri Sudha, Tollywood News, Power St-TeluguStop.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఈ సినిమా ఉండటంతో ఈ సినిమాను నిలిపివేయాలని పవన్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు.

అయితే వర్మ మాత్రం ఎవరికీ వినకుండా తన సినిమాను రిలీజ్ చేశాడు.

ఇక ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు వర్మ.దీంతో తన నెక్ట్స్ చిత్రాలపై అప్పుడే ఫోకస్ పెట్టాడు ఈ డైరెక్టర్.

ఇప్పటికే నగ్నం చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తానంటూ చెప్పిన వర్మ, ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్‌ను ఎంపిక చేశాడట.అర్జున్ రెడ్డి, రూలర్ వంటి చిత్రాల్లో కనిపించిన నటి శ్రీ సుధా, ఇటీవల తనను ఓ కొరియోగ్రాఫర్ మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించడంతో వార్తల్లో నిలిచింది.

ఇప్పుడు నగ్నం సినిమాకు సీక్వెల్‌లో ఈమెను తీసుకున్నాడు వర్మ.మరి వర్మ కోసం ఈ సినిమాలో శ్రీ సుధా ఎలా కనిపిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాను అనుకున్న దానికంటే ముందే రిలీజ్ చేయగల వర్మ, ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చూడాలి.కాగా మరికొన్ని సినిమాలను సైతం వర్మ క్యూలో పెట్టిన సంగతి తెలిసిందే.

నగ్నం చిత్రం సృష్టించిన సెన్సేషన్ సీక్వెల్ చిత్రం కూడా కొనసాగిస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube