వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.వరుసగా సినిమాలను తెరకెక్కించడమే కాకుండా వాటిని తన సొంత ఏటీటీలో రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నాడు.
ఇక ఇటీవల ‘పవర్ స్టార్’ చిత్రంతో వర్మ చేసిన రచ్చ అంతాఇంత కాదు.పవన్ కళ్యాణ్‌పై వర్మ ఈ సినిమా చేయడంతో పవన్ ఫ్యాన్స్ అతడిపై దాడికి కూడా యత్నించారు.
అయినా వర్మ మాత్రం రెట్టింపు వేగంతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
ఇక తాజాగా వర్మ మరో వివాదాస్పదమైన సినిమాను వదిలేందుకు రెడీ అయ్యాడు.
గతంలో ప్రణయ్ పరువుహత్య ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.అమృత-ప్రణయ్‌ల ప్రేమ వివాహం ఇష్టంలేని అమృత తండ్రి మారుతీరావు, కిరాయి గూండాలతో ప్రణయ్‌ను అతికిరాతకంగా చంపించాడు.
ఈ పరువు హత్య అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విషయం తెలిసిందే.ఆ తరువాత ఈ ఘటనకు సంబంధించి జైలు జీవితాన్ని అనుభవించిన మారుతీరావు, ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కథకు ఫుల్‌స్టాప్ పడింది.
అయితే ఇప్పుడు మారుతీరావు, అమృత-ప్రణయ్‌ల కథను వర్మ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడు.మర్డర్ అనే టైటిల్‌తో ఈ సినిమాను తీసుకొస్తున్న వర్మ తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.
ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే, ఇది పూర్తిగా ఓ కూతురిపై తండ్రి అతిప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే అంశంపై వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను ఆనంద్ చంద్ర డైరెక్ట్ చేస్తుండగా నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
కుటుంబ కథా చిత్రమ్ అనే క్యాప్షన్‌తో వస్తోన్న మర్డర్ చిత్ర ట్రైలర్‌ను మీరూ ఓసారి చూసేయండి.