తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితగ్గేదే లేదు అన్నట్లుగా తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పై పోరాటం చేస్తున్నారు.ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు ప్రజల్లో కాంగ్రెస్ కు ఆదరణ లభించే విధంగా రేవంత్ వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తనకు సహకరించిన, సహకరించకపోయినా తాను మాత్రం కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వచ్చే వరకు ఇదే విధంగా పోరాడుతా అన్న విధంగా రేవంత్ వ్యవహారాలు చేస్తున్నారు.ఎప్పటికప్పుడు వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతూ , కాంగ్రెస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
టిఆర్ఎస్ తర్వాత బిజెపి అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి ఉన్నా, ఎన్నికల సమయం నాటికి అధికార పార్టీ టిఆర్ఎస్ తో పాటు కేంద్ర అధికార పార్టీ బిజెపి పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని , కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందని రేవంత్ అంచనా వేస్తున్నారు .
ప్రస్తుతానికి కాంగ్రెస్ రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఇదంతా తాత్కాలికమేనని, ఎన్నికల సమయం నాటికి బాగా బలం పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు.అలాగే పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయని రేవంత్ అభిప్రాయపడుతున్నారు.అందుకే టిఆర్ఎస్ బిజెపి ఒకపక్క బలోపేతం అయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న, రేవంత్ మాత్రం సైలెంట్ గా తన వ్యూహాలను అమలు చేస్తున్నారు.
ప్రస్తుతానికి సొంత పార్టీ నేతల నుంచి సహకారం అంతంతమాత్రంగా ఉన్నా, ఎన్నికల సమయం నాటికి తన వర్గం కీలకంగా మారుతుందని, అలాగే ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం కల్పించి గ్రామ పట్టణ స్థాయిలో కాంగ్రెస్ ప్రభావం పెరిగేలా చేసేందుకు రేవంత్ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు.తెలంగాణ అంతటా పాదయాత్ర చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పాదయాత్ర ద్వారా పెద్ద ఎత్తున చేరికలు ప్రోత్సహించాలని, ప్రజలకు మరింత చేరువ అవ్వాలనే వ్యూహంలో రేవంత్ ఉన్నారు.