ఎన్నికల ( Telangana Politics )దగ్గరికి వచ్చే కొద్ది తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగం పుంజుకోవడంతో ప్రత్యర్థుల వ్యూహాలను ముందుగానే పసిగడుతున్న కేసీఆర్ వాటికి విరుగుడు మంత్రాలని ప్రయోగిస్తూ ముందుకు వెళ్తున్నారు.ప్రభుత్వ అభివృద్ధిని ప్రచారం చేసుకునేలా జిల్లాల వ్యాప్తంగా పర్యటనలను ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది .
ఆగస్టు చివరివారంతో మొదలుపెట్టి ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు ఇక ప్రజల్లోనే ఉండాలని ,బహిరంగ సభలు, సమీక్షా సమావేశాలతో ఎన్నికల వాతావరణాన్ని సృష్టించాలన్న నిర్ణయానికి గులాబీ బాస్ వచ్చినట్లుగా తెలుస్తుంది .

ఈ నెలాఖరుకు సూర్యాపేట ,మెదక్ ల లో పర్యటించి భారీ బహిరంగ సభల్లో కేసీఆర్( CM kcr ) పాల్గొను పోతున్నారని తెలుస్తుంది .ఇకపై ప్రతి నెల రెండు జిల్లాలను టార్గెట్ చేసి ఎన్నికలు వచ్చేవరకు ప్రజల్లోనే ఉండాలని ఇప్పటికే ప్రతినిధులకు నాయకులకు కేసీఆర్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది .ప్రతిపక్షాలకు పుంజుకునే సమయం ఇవ్వకూడదని, తెలంగాణలో అనేక వర్గాలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా అనేక సంక్షేమ పథకాలు అ( Welfare Schemes )మలు చేసినందున వాటి అమలులో ఉన్న లోపాలను ఇప్పటినుంచే సరి చేసుకుంటూ పూర్తిస్థాయి పాజిటివ్ ఓట్ బ్యాంకు ను పెంచుకోవాలని నాయకులకు స్పస్టం చేసిన కేసీఆర్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ లోటుపాట్లను సరిచేయాలని ఇప్పటికే మంత్రులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది

ఈ నాలుగు నెలలు పూర్తిస్థాయిలో కష్టపడాలని అలసత్వాన్ని సహించన ని అంటూ వార్నింగ్ కూడా చ్చేశారట ప్రతిపక్షాల అనేక ఎత్తుగడలకు పాల్పడే అవకాశం ఉందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆదిలోనే తిప్పి కొట్టాలని.ప్రభుత్వం వల్ల మంచి జరుగుతున్న ప్రతి వ్యక్తి ని ప్రత్యక్షంగా కలుసుకొవాలని నాయకులకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది.ఇప్పటికే అనేక వర్గాలకు వరాల జల్లు కురిపించడం ద్వారా ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో నిలబడిన కేసీఆర్ వచ్చే నాలుగు నెలల్లో కూడా ప్రచారంలోకూడా ప్రతిపక్షాలకు కంటే చాలా ముందు నిలబడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.
దాంతో ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణాన్ని సృష్టించేటట్టుగా ఆయన జిల్లాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.







