కరోనా వైరస్ ప్రభావం మొన్నటి వరకు దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది.దాదాపు 4,5 లక్షల వరకు నిత్యం కేసులు నమోదు ప్రజలను భయాందోళనకు గురి చేసింది.
అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.కరోనా వైరస్ ప్రభావం బాగా తగ్గుముఖం పట్టడంతో వాటిని ఎత్తివేశారు.
సాధారణ పరిస్థితికి జనజీవనం వచ్చేసారు.అన్ని కార్యకలాపాలు యధావిధిగా మొదలైపోయాయి ఈ పరిణామాలు ఏపీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేయడం జనాలకు ఆనందం కలిగిస్తున్నా, టిడిపి లీడర్స్ మాత్రం ఆందోళన చెందడానికి కారణమూ లేకపోలేదు.కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో, ఇక పార్టీ నేతలంతా జనంలోకి వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, ప్రజా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని, వైసిపి ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతూ వివిధ కార్యక్రమాలు రూపొందించాలని, నియోజకవర్గాల వారీగా నాయకులంతా యాక్టివ్ గా ఉంటూ నిరంతరం పోరాటం చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నుంచి ఆదేశాలు వెళ్లడంతో, టిడిపి ముఖ్య నాయకులంతా లబోదిబోమంటున్నారట.
దీనికి కారణం పార్టీ కార్యక్రమాలు, ఆందోళన నిర్వహించాలంటే భారీ ఎత్తున కేడర్ ను సమాయత్తం చేయాలని, లక్షలాది రూపాయలు సొమ్ములు ప్రతి కార్యక్రమానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇప్పటికే 2019 ఎన్నికల సమయంలో భారీగా సొమ్ము ఖర్చు పెట్టమని, మళ్లీ ఎన్నికల సమయం వరకు పార్టీ కార్యక్రమాల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదని, పోనీ ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం నుంచి ఆర్థిక అండదండలు అందుతున్నాయా అంటే అదీ లేదని, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనే ఈ విషయంలో టీడీపీ లీడర్స్ కంగారు పడుతున్నారట.

ఇక నియోజకవర్గ స్థాయి నాయకుల పరిస్థితి అదే విధంగా ఉంది.ఇప్పటి నుంచే కోట్లాది రూపాయల సొమ్ములు పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు పెడితే, ఎన్నికల సమయంలో టికెట్ ఇస్తారన్న గ్యారంటీ లేదని, అలా అని ఇప్పటి నుంచి సైలెంట్ గా ఉండిపోతే అసలు ఎన్నికల సందర్భంగా టికెట్స్ ఇచ్చే సమయంలో తమను పరిగణలోకి తీసుకోరని ఒకటే కంగారు పడుతున్నారట.