2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి.తాజాగా పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి చేసిన కామెంట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తాజాగా పోసాని కృష్ణమురళి( Posani krishnamurali ) పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు అటు పొలిటికల్ వర్గాల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ప్రస్తుతం పోసాని కృష్ణమురళి ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ ఛైర్మన్ గా ఉన్నారనే సంగతి తెలిసిందే.ఆయన మాట్లాడుతూ పాలిటిక్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మాట్లాడాలని అన్నారు.జగన్ ను ఓడించే బలం పవన్ కు లేదని చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర సంపద పెరగదని హెరిటేజ్ సంపద మాత్రమే పెరుగుతుందని పోసాని కృష్ణమురళి అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాను యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పని చేశానని ఆ సమయంలోనే వైఎస్సార్ తో పరిచయం ఏర్పడిందని పోసాని అన్నారు.వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే జగన్ మెరుగైన పాలన అందిస్తున్నారని పోసాని వెల్లడించారు.
జగన్ ను ఓడించే సత్తా పవన్ కు ఉంటే పవన్ చిరంజీవిని ఎందుకు సీఎం చేయలేకపోయారని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.

పవన్ కాపులను మోసం చేస్తున్నాడని కాపులకు నష్టం చేస్తున్నాడని ఆయన కామెంట్లు చేస్తున్నారు.పవన్ కాపు నాయకులను, ముద్రగడను తిట్టడం రైటేనా అని పోసాని ప్రశ్నించారు.పవన్ కొన్ని సీట్లు తీసుకుని అధికారాన్ని చంద్రబాబు( Chandrababu Naidu )కు అప్పగిస్తే ప్రజలు ఊరుకుంటారా అని పోసాని కామెంట్లు చేశారు.
పవన్ ముద్రగడను( Pawan kalyan ) తిట్టించడం దారుణం అని పోసాని పేర్కొన్నారు.పోసాని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆర్జీవీ సైతం పవన్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.







