టీడీపీ లో రాజీనామాల పర్వం ! కైకలూరు సభ లో లొల్లి 

ఒక పక్క యువ గళం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపడుతుండగా , మరోవైపు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తూ పార్టీ కేడర్ లో జోష్ పెంచుతున్నారు.అలాగే వైసిపి అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 Resignations In Tdp, Lolli In Kaikaluru Sabha,jayamangala Venkataramana, Tdp, Ch-TeluguStop.com

ఎన్నికల సమయానికి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించి వైసీపీని ఇరుకున పెట్టాలని చంద్రబాబు భావిస్తుండగా , ఇప్పుడు టిడిపిలోనే వలసలు మొదలు కావడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గ టిడిపిలో అలజడి రేగింది.

ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పార్టీకి రాజీనామా చేసి నేడు వైసీపీలో చేరనున్నారు.అలాగే  టిడిపి అసంతృప్త నాయకులు జయ మంగళ వెంకటరమణ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు.

దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పార్టీని వీడి ఎవరూ వైసీపీలో చేరకుండా చేసేందుకు టిడిపి ముఖ్య నేతలను చంద్రబాబు రంగంలోకి దించారు.

Telugu Chandrababu, Jagan, Kaikaluru Mla, Lokesh, Maganti Babu, Ysrcp, Yuvagalam

ఈ మేరకు టిడిపి మాజీ ఎంపీ మాగంటి బాబు ఏలూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు,  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విటల్ రావు,  చలమయ్యల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కైకలూరు టిడిపి పట్టణ అధ్యక్షుడు జానీకి వేదికపై చోటు కల్పించకపోవడంపై ఆయన సమావేశానికి హాజరైన పార్టీ పెద్దలను ప్రశ్నించారు.జానికి మద్దతుగా రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి జేఎస్ మల్యాద్రి వేదికపై నాయకులను ప్రశ్నించారు.

Telugu Chandrababu, Jagan, Kaikaluru Mla, Lokesh, Maganti Babu, Ysrcp, Yuvagalam

దీంతో గన్ని వీరాంజనేయులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా జానీ మల్యాద్రిలు మాజీ ఎమ్మెల్సీ విఠల్రావుకు మధ్య వాగ్వాదం నడిచింది.జయ మంగళ వెంకటరమణ ప్రధాన అనుచరులను పార్టీ నుంచి సాగనంపేందుకు ఈ విధంగా చేస్తున్నారని, జానీ,  మల్యాద్రిలు వేదికపై ఉన్న పార్టీ పెద్దలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పెద్ద వాగ్వాదమే జరిగింది.

ఈ సందర్భంగా టిడిపి రైతు అధికార ప్రతినిధి సయ్యపరాజు గుర్రాజు పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖ రాశారు ఆ లేఖను చంద్రబాబుకు పంపుతున్నట్లు ఆయన తెలిపారు.దీంతోపాటు మరికొంతమంది నేతలు టిడిపికి రాజీనామా చేసి జయమంగళ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు ఈరోజు వారంతా జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube