చాలామంది హీరోలు చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ ఉంటారు.అయితే మరి కొంతమంది నటులు మాత్రం ఒక టైం వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతూ ఉంటారు.
కొందరికి అవకాశాలు తగ్గిపోవడం వల్ల హీరోలుగా చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే జగపతి బాబు( Jagapathi Babu ) లాంటి నటుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాడు.
కానీ మోహన్ బాబు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారినప్పటికీ ఆయనని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.

నిజానికి మోహన్ బాబు( Mohan Babu ) మంచి నటుడు, అయినప్పటికీ ఆయన నటనని పూర్తిస్థాయిలో వాడుకోవాలంటే మాత్రం అది పెద్ద దర్శకుల వల్లే అవుతుంది అంటూ కుర్ర దర్శకులు మోహన్ బాబుని తమ సినిమాల్లో తీసుకోవడం లేదు.ఎందుకంటే ఆయనని హ్యాండిల్ చేయడం కుర్ర దర్శకుల వల్ల అవ్వదు.అందువల్లే ఆయనని హ్యాండిల్ చేయాలంటే పెద్ద దర్శకులు( Directors ) రంగంలోకి దిగాలి.
కానీ ఆయనతో పెద్ద దర్శకులతో ఎవరి సినిమా చేసేంత క్రేజ్ అయితే ఆయనకి లేదు.ఇక దానికి తోడు గా ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ అడుగుతాడు.
దానివల్ల చాలామంది సఫర్ అయ్యే పరిస్థితిలైతే ఎదురవుతాయి.అందువల్ల తనని తీసుకొని ఇబ్బందులు పడకుండా సినిమా చేసుకుంటూ వెళ్తే మంచిదని వేరే ఆర్టిస్ట్ ని తీసుకుంటున్నారు.

ఇక ఇండస్ట్రీలో మోహన్ బాబుకి అవకాశం రాకపోవడానికి కారణం ఇదే అని చెప్పాలి…అందుకే ప్రస్తుతం మోహన్ బాబు సినిమాలు ఏమి లేకుండా ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు…ఇక ఇప్పటికైన మోహన్ బాబు ఏ విషయాలూ పట్టించుకోకుండా ఒక సినిమా మీద ఫోకస్ పెడితే చాలా మంచి అవకాశాలు వస్తాయనే చెప్పలి…