రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రముఖ మాస్టర్ కార్డ్‌కు ఆంక్షలు విధించింది.వినియోగదారుల డేటా స్టోరేజీ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.
అయితే, ఈ నిర్ణయంతో ప్రస్తుత కస్టమర్లపై ఎటువంటి ప్రభావం పడదని తెలిపింది.అయితే, మాస్టర్ కార్డు కొత్తగా మాస్టర్ కార్డులు జారీ చేయకూడదని హెచ్చరించింది.2021 జూలై 22 నుంచి ఇది అమలు కానుంది.వివిధ బ్యాంకుల ద్వారా అందిస్తోన్న మాస్టర్ కార్డు నియమాలను వారు నిబంధనలు పాటించాలని సూచనలు చేయమని ఆదేశించింది ఆర్‌బీఐ.
లేకపోతే ఆర్‌బీఐకి ఉన్న పవర్ ఆధారంగా.చెల్లింపుల నియమాల యాక్ట్ సెక్షన్ 17, 2007 ప్రకారం చర్యలు తీసుకుంటామని మాస్టర్ కార్డును హెచ్చరించింది.
మాస్టర్ కార్డు పీఎస్‌ఎస్ యాక్ట్ నియమాల ప్రకారం దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోంది.అయితే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిన ఆర్‌బీఐ నిబంధనలను పట్టించుకోనందునే ఈ ఆంక్షలకు గురైంది.
ఇప్పటికే బ్యాంకుల నిర్వహణలో ఎన్నో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి.మరోవైపు లాభాలు అంతగా ఆర్జించని బ్యాంకులను నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు ఇతర బ్యాంకులతో మెర్జ్ కూడా చేసింది.
మరోవైపు బ్యాంకుల ప్రైవేౖటెజేషన్‌పై కూడా ఆలోచనలో ఉంది ఆర్‌బీఐ.ఈ నేపథ్యంలో డెబిట్, క్రెడిట్ కార్డుల నిర్వహణ నిబంధనల ఉల్లంఘులపై కూడా కొరడా ఝుళిపిస్తోంది.

అసలు 2018 ఏప్రిల్ 6 ఆర్‌బీఐ ఆదేశాల మేరకు దేశంలో సాగిస్తున్న మాస్టర్ కార్డు కార్యకలాపాలను పేమెంట్ సిస్టం ప్రొవైడర్లు… అదేవిధంగా యూజర్ల డేటా మొత్తం మన దేశంలోనే స్టోర్ చేయాలి.కానీ, మాస్టర్‌కార్డు ఈ నిబంధనలను ఉల్లంఘించింది.నిబంధనలు అమలు చేసేందుకు ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది.

అయినా కానీ స్టోరేజీ నిబంధనలు పట్టించుకోని సంస్థలపై ఆర్‌బీఐ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.ఇప్పటికే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఇతర కార్డులపై కూడా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.ఇక మాస్టర్ కార్డుకు సంబంధించిన ఆడిట్ లెక్కలను కూడా ఆదేశించిన సమయం నాటికి సమర్పించాలని తెలిపింది.
ఇక దీనిపై మాస్టర్ కార్డు నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇంక తెలియలేదు.వారు స్పందించాల్సి ఉంది.