రష్మికకు ప్రపోజ్ చేసిన రౌడీ హీరో.. ఏం జరిగిందంటే..?

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక కాంబినేషన్ ప్రేక్షకుల్లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకుంది.రష్మిక విజయ్ కాంబినేషన్ లో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు తెరకెక్కాయి.

 Rashmika Mandanna Vijay Devarakonda Santoor Ad Video Goes Viral,latets-TeluguStop.com

ఈ రెండు సినిమాల్లో గీతా గోవిందం సినిమా హిట్ ఫలితాన్ని అందుకుంటే డియర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ ఫలితాన్ని అందుకుంది.అయితే విజయ్ దేవరకొండ తాజాగా రష్మికకు ప్రపోజ్ చేశారు.

కొన్నేళ్ల క్రితం రష్మిక విజయ్ ల మధ్య ఏదో ఉందని వార్తలు రాగా వీళ్లిద్దరూ ఆ గాసిప్స్ ను ఖండించిన సంగతి తెలిసిందే.అయితే ఇద్దరి మధ్య స్నేహం మాత్రం కొనసాగుతోంది.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కకపోయినా సంతూర్ సోప్ కు సంబంధించిన యాడ్ లో వీళ్లిద్దరూ కలిసి నటించారు.ఇప్పటికే ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే ఈ యాడ్ టీవీలో ప్రసారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం.మరోవైపు రష్మిక తెలుగులో సుకుమార్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్పలో నటిస్తున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రష్మిక రెండు సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం.ఈ రెండు సినిమాలు హిట్టైతే బాలీవుడ్ లో రష్మిక వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఈ రెండు సినిమాలతో రష్మిక ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.రష్మిక విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube