బిగ్ బాస్ సీజన్ 7కి హోస్ట్ గా రానా.. షో నిర్వాహకులపై మండిపడుతున్న నాగార్జున?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 షో తాజాగా ముగిసిన విషయం తెలిసిందే.దీంతో సోషల్ మీడియాలో అప్పుడే బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన వార్తలు మొదలయ్యాయి.

 Rana Is The Host Of Bigg Boss Season7 ,rana , Bigg Boss Season 7, Tollywood, Nag-TeluguStop.com

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాలనుకోవడం లేదు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో అంటే బోర్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తుండగా, ఇంకొందరు నాగార్జునకి షోలో అంత పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తున్నప్పుడు ఎందుకు వదులుకుంటారు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ సీజన్ 7కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనని తెగేసి చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ యాజమాన్యంపై నాగార్జున కోపంగా ఉన్నారని, బిగ్ బాస్ షో నిర్వహకులపై నాగార్జున తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకు గల కారణం కూడా లేకపోలేదు.ఎందుకంటే బిగ్ బాస్ షో కి సంబంధించిన లీకులు నాగార్జునకు చిరాకు తెప్పిస్తున్నాయట.వాటిని ఆపడంలో బిగ్ బాస్ యాజమాన్యం విఫలమయ్యిందని నాగార్జున వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.అదేవిధంగా తాజాగా ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసి బయటకు పంపించినప్పుడు నాగార్జున పై భారీగా ట్రోలింగ్స్ జరిగిన విషయం తెలిసిందే.

Telugu Inaya, Nagarjuna, Rana, Tollywood-Movie

ఆ సమయంలో నాగార్జునకు ట్రోల్స్ చిరాకు తెప్పించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.మరి ముఖ్యంగా ఇనయ ఎలిమినేట్ విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పట్ల ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా హోస్ట్ నాగార్జున పై మండిపడిన విషయం తెలిసిందే.ఆ విషయంలో నాగార్జున బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది.దీంతో తదుపరి సీజన్ కి తాను పోస్టుగా పనిచేయలేనని చెప్పడంతో నాగార్జున ప్లేస్ లోకి హీరో రానా ను తీసుకురాబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

రానా కూడా బిగ్బాస్ షోని హోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube