బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈయన బాలీవుడ్ హీరో అయినప్పటికీ కూడా టాలీవుడ్ లో ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.
అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరో చిరంజీవి సినిమాలో కూడా ఒక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.అయితే ఈయనతో చాలామంది నటీనటులు నటించడానికి ఆసక్తి చూపిస్తారు.
అందులో మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఉన్నారు.తాజాగా ఈయనతో నటించడానికి జగపతి బాబు కూడా సిద్ధంగా ఉన్నాడు.
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు జగపతి బాబు గురించి అందరికి తెలిసిందే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాకుండా తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.చాలా వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో హీరోగా నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.
ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ తన పాత్రలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉన్నాడు.
1992లో అసాధ్యులు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన జగపతి బాబు ఆ తర్వాత గాయం, జాబిలమ్మ పెళ్లి, దొంగాట వంటి సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకొని వెనుతిరగకుండా వరుస సినిమాలలో నటించాడు.ఇక మధ్యలో కొన్ని ఏళ్ళు ఇండస్ట్రీకి దూరమైన జగపతిబాబు మళ్లీ రీ ఎంట్రీ తో వయసుకు తగ్గ పాత్రలనే కాకుండా విలన్ పాత్రల్లో కూడా నటించాడు.
ఒక హీరోగానే కాకుండా హీరో హీరోయిన్స్ కు తండ్రిగా, విలన్ పాత్రగా కూడా జగపతి బాబు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు.విలన్ పాత్రతో కూడా అందర్నీ మెప్పిస్తూ వరుసగా అవే అవకాశాలు అందుకుంటున్నాడు.ఇక ఇప్పటికీ జగపతిబాబు లుక్ ఏం మాత్రం మారలేదు.ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.అంతేకాకుండా ఈమధ్య బాగా వర్కౌట్లు కూడా చేస్తున్నాడు.జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.
కొన్ని కొన్ని వీడియోలు షేర్ చేసుకుంటారు.అప్పుడప్పుడు తను వంట గదిలో చేసే ప్రయోగాలను కూడా వీడియోలు చేస్తూ చూపిస్తాడు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో షేర్ చేసుకున్నాడు.అందులో ఆయన భారీ వర్కౌట్ చేస్తున్నట్లు కనిపించాడు.అయితే ఇదంతా సల్మాన్ ఖాన్ కోసం అని తెలిసింది.
సల్మాన్ భాయ్ తో కలిసి సినిమా చేయడానికి రెడి అవుతున్న జగ్గు భాయ్.అంటే నేనే అంటూ ఆ వీడియో షేర్ చేసుకున్నాడు జగపతిబాబు.అందులో అతను చాలా కష్టపడుతున్నట్లు కనిపించాడు.
ఈ వీడియోని చూసిన ఆయన అభిమానులు ఈ వయసులో కూడా మీరు ఇంత ఎనర్జీగా ఉన్నారు అంటే మామూలు విషయం కాదు అంటు పొగుడుతున్నారు.ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది.