డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni), శ్రీ లీల(Sreeleela) జంటగా నటించిన చిత్రం స్కంద(Skanda Movie).ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్స్ సాంగ్స్ కనుక చూస్తే ఈ సినిమా మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలుస్తుంది.మరి నేడు విడుదలైనటువంటి ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందిందో ఇక్కడ తెలుసుకుందాం.
కథ:
ఏపీ ముఖ్యమంత్రి కుమార్తె పెళ్లి జరుగుతూ ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు ఈ పెళ్లిలో పెళ్లికూతురని తీసుకొని వెళ్ళిపోతాడు.ఇలా తెలంగాణ సీఎం కొడుకును చంపే దాకా తాను నిద్రపోను అటు ఏపీ ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తాడు.మరి తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు నుంచి ఏపీ ముఖ్యమంత్రి కూతురికి విముక్తి కలిగిందా? ఈ సినిమాలో స్కంద (రామ్) పాత్ర ఎంతవరకు ఉంది ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గొడవలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఈ గొడవలు స్కంద పాత్ర( Skanda ) ఏంటి అనే విషయం తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే.
నటీనటులు:
రామ్ పోతినేని తన ఎనర్జీ లెవల్ తో ఎప్పటిలాగే మాస్ యాక్షన్( Mass Action ) సన్నీవేషాలు ఇరగదీసాడని చెప్పాలి.ఇక శ్రీ లీల ఉన్నంతవరకు పరవాలేదు అనిపించేలాగా నటించారు.ఇక వీరిద్దరూ డాన్స్ మాత్రం అదరగొట్టారని చెప్పాలి.ఇక ఈ సినిమాలో సయి మంజ్రేకర్,( Saiee Manjrekar ) శ్రీకాంత్( Srikanth ) గౌతమి( Goutami ) వంటి ఇతర తారాగణం వారి పాత్రలకు 100% న్యాయం చేశారు.
టెక్నీషియన్స్:
బోయపాటి(Boyapati Sreenu) ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా తన స్టైల్ లో మాస్ ఎలిమెంట్స్ అద్భుతంగా చిత్రీకరించారు.ఇక బ్యాగ్రౌండ్ సోర్స్ మ్యూజిక్ అదిరిపోయింది అని చెప్పాలి.
సినిమాటోగ్రఫీ వర్క్ పరవాలేదు అనిపించింది.
ప్లస్ పాయింట్స్:
మాస్ ఎలివేషన్ సీన్స్, శ్రీ లీల డాన్స్ పెర్ఫార్మెన్స్, రామ్ స్క్రీన్ ప్రజెంట్, బ్యాక్గ్రౌండ్ సోర్స్.
మైనస్ పాయింట్స్:
కథ కామన్ గానే అనిపించింది, కొన్నిచోట్ల వచ్చిన సన్నివేశాలకు లాజిక్ మిస్ అయిందని చెప్పాలి.
బాటమ్ లైన్:
స్కంద సినిమాలు లాజిక్ లేకపోయినప్పటికీ బోయపాటి మాత్రం మ్యాజిక్ చేశారు ఒకసారి ఈ సినిమాని బోర్ కొట్టకుండా చూడవచ్చు.