గులాబీ బాస్ కేసీఆర్ ( CM KCR ) ఏ పని చేసిన దాని ముందు వెనకాల ఆలోచించి చేస్తారు.భవిష్యత్తు ప్రణాళిక వేసుకున్న తర్వాతే ఏ పనైనా మొదలుపెడతారు.
రాజకీయంగా ఎదుటివారిని మట్టి కల్పించడంలో కేసీఆర్ వేసే ఎత్తులను అస్సలు అర్థం చేసుకోలేం.క్షణాల్లో ఎలాంటి సమయాన్ని అయినా తన వైపు తిప్పుకునేంత సత్తా కేసీఆర్ కు ఉంటుంది.అలాంటి కేసీఆర్ ఈసారి ఎన్నికల రేసు గుర్రాలను ముందుగానే ప్రకటించారు.115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి, ఆయా నియోజకవర్గాల్లో గట్టిగా ప్రచారం చేయాలని వారికి సంకేతాలు పంపారు.దీంతో టికెట్ వచ్చిన చాలామంది అభ్యర్థులు నియోజకవర్గాల్లో వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
![Telugu Kadiyam Srihari, Ghanpur, Rajaiah, Telangana-Politics Telugu Kadiyam Srihari, Ghanpur, Rajaiah, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/CM-kcr-BRS-party-Congress-party-telangana-politics-Harish-Rao-Kadiyam-Srihari.jpg)
ఇదే తరుణంలో రసభసాగా మారినటువంటి స్టేషన్ ఘన్ పూర్ ( Station Ghanpur ) బిఆర్ఎస్ టికెట్టు కడియం శ్రీహరికి కేటాయించారు కేసీఆర్.దీంతో ప్రస్తుతం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నోట్లో మట్టి కొట్టినట్టు అయింది.ఆయన టికెట్ కేటాయించకుండా కడియం శ్రీహరికి టికెట్ కేటాయించడంతో రాజయ్య మరియు ఆయన అనుచరులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
కేసీఆర్ పై ఎలాంటి అవాకులు చావాకులు చేయకుండా ఆయన నిర్ణయమే శిరసావహించి ఉన్నానని రాజయ్య మాట్లాడారు.టికెట్ విషయంలో కేసీఆర్ పునరాలోచిస్తారని రాజయ్య ( Rajaiah ) గంపడాశలు పెట్టుకున్నారు.
అంతేకాకుండా తన సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యే విధంగా అనేక రకాలుగా సోషల్ మీడియాలో, వార్తల్లో ఏడుపులు, పెడబొబ్బలతో స్పీచ్ లు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
![Telugu Kadiyam Srihari, Ghanpur, Rajaiah, Telangana-Politics Telugu Kadiyam Srihari, Ghanpur, Rajaiah, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Rajaiah-telangana-politics-Harish-Rao-Kadiyam-Srihari.jpg)
అయితే తాజాగా ఆయన స్టేషన్గన్పూర్ లో ఎక్కువగా మాదిగలు ఉన్నారు.కాబట్టి బీఫామ్ నాకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మరి రాజయ్య ఈ సెంటిమెంట్ ద్వారా బి ఫాం పొందుతారా.? లేకుంటే చివరి వరకు కూడా టికెట్ ఇవ్వకుంటే ఇంకా ఏదైనా పార్టీలోకి వెళ్తారా.? లేకుంటే ఇండిపెండెంట్ గా పోటీచేసి సెంటిమెంటల్ గా ఓట్లు కొట్టేసే ప్రయత్నం చేస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.