టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూశారు.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటించారు.అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈ సినిమా నేడు విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.అదేవిధంగా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ క్రమంలోనే గురువారం రాత్రి తెలుగు మీడియా ప్రెస్ మీట్ నిర్వహించడంతో ఇందులో పాల్గొన్న అల్లు అర్జున్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక డైరెక్టర్ హీరోని ప్రేమిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఆ సినిమానే పుష్ప అంటూ సినిమా గురించి చెప్పుకొచ్చారు.
అలాగే ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక పై అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు.

సాధారణంగా నాకు అతి తక్కువ మంది నచ్చుతారని అలాంటి వారిలో రష్మిక ఒకరు అంటూ ఈ సందర్భంగా ఆమె గురించి వెల్లడించారు.రష్మిక చాలా తెలివైన అమ్మాయి డౌన్ టు ఎర్త్ ఉంటుందని ఈ సందర్భంగా అల్లుఅర్జున్ శ్రీవల్లి పై ప్రశంసలు కురిపించారు.ఇదే విషయాన్ని ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పాలని భావించానని అయితే కుదరలేదు అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన దేవిశ్రీప్రసాద్ గురించి మాట్లాడుతూ ఆయనతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని, ఇక ఈ విధంగా తెలుగు మీడియాతో మాట్లాడటం తనకు చాలా సంతృప్తిగా ఉందని అల్లుఅర్జున్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పుష్ప సినిమా గురించి వెల్లడించారు.